200 కోట్లతో బెంగుళూరు యలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్ మాయా మహల్ ని తలదన్నే విధంగా అమరావతి లో జగన్ మహల్ నిర్మాణం జరిగింది. సియం కుర్చీ మీద ఉన్న ఇష్టంతో, ముందుగానే సీఎం క్యాంపు ఆఫీస్ సైతం నిర్మించుకున్నారు జగన్. 2 ఎకరాల్లో భారీ నిర్మాణాలు జరిగాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ లో సిఎంఓ ఆఫీస్ సిబ్బంది కి క్యాబిన్లు, ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంట్లో అత్యాధునిక సదుపాయాలు,అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు, మినీ థియేటర్,లైబ్రరీ,జిమ్, తదితర సౌకర్యాలుఉన్నాయి. ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న ఫర్నిచర్ కూడా ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనం లూటీ చేసి ఐఎఎస్ అధికారులను జైలుకి పంపి తాను మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు జగన్.
ఒక దానిని మించి మరొకటి...బెంగుళూరు యలహంక ప్యాలస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. 32 ఎకరాల్లో అక్షరాల 1000 కోట్లతో ఆ ప్యాలస్ నిర్మించారు జగన్. అక్కడ లేని సదుపాయాలు అంటూ ఉండవు. అన్న గాలి జనార్ధన్ రెడ్డి హెలికాప్టర్ లో దిగడానికి హెలిప్యాడ్ సైతం నిర్మించారు. ఆ తరువాత లోటస్ పాండ్ లో మాయా మహల్ నిర్మాణం సుమారుగా 350 కోట్ల తో 60 రూముల భవనం అది. అత్యాధునిక లిఫ్టులు,ఎక్సలేటర్లు,200 మంది సినిమా చూసే మినీ థియేటర్,జిమ్,స్క్వాష్,టెన్నిస్,వాలీ బాల్ కోర్టులు ,రాజస్థాన్ మార్బుల్ ఇలా 42 వేల చదరపు అడుగులో లోటస్ పాండ్ మాయా మహల్ నిర్మాణం జరిగింది.... ఇప్పుడు అమరావతిలో కూడా జగన్ తన మార్క్ భవనం ఉండాలి అని డిసైడ్ అయ్యారు.రెండు ఎకరాల్లో ఈ భావనలు రెడి అయ్యాయి 200 కోట్ల తో అత్యాధునిక భవనాలు నిర్మాణం పూర్తి అయ్యింది.
అయితే నేనే సియం అనే భ్రమలో, ఇంకా ఎన్నికలు కాక ముందే జగన్ తాను సీఎం అయిపోతాననే కాన్ఫిడెన్సు లో ఉన్నారు. అందుకు అనుగుణంగా సీఎం క్యాంపు ఆఫీస్ కూడా నిర్మించుకున్నారని తెలుస్తుంది. నేనే సీఎం అనే అన్న ధీమా తో ముందే ముఖ్యమంత్రి కార్యాలయం,ఐఏఎస్ అధికారులకు చాంబర్స్ ఇలా అన్ని నిర్మాణం అయ్యాయి.అలాగే ఇక్కడ దీని పక్కనే పార్టీ ఆఫీస్ కూడా పూర్తి అయ్యింది.స్విమ్మింగ్ పూల్,సినిమా థియేటర్,జిమ్ ఇలా అన్ని సదుపాయాలు ఆ ఇంటి సొంతం.అమరావతిలో అన్ని నిర్మాణాలు ఆగిపోవాలి,ఎక్కడ ఏమి అభివృద్ధి జరగడం లేదు అంటూ తన పత్రికలో డబ్బా కొట్టే జగన్ అమరావతిలో 200 కోట్ల తో ఇల్లు కట్టాడు అని తెలుసుకొని వైకాపా పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిజానికి జగన్ ఉండేది హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే, అక్కడ నుంచే, కేసీఆర్ తో కలిసి అన్ని కుట్రలు పన్నుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను సియం అయిపోతున్నాని, చంద్రబాబు కట్టించిన సెక్రటేరియట్ నుంచి పని చెయ్యటం ఇష్టం లేక, ఇక్కడ కట్టే ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా వాడుకుంటూ, కేసిఆర్ లాగ ఫాం హౌస్ పరిపాలాన సాగించాలని జగన్ ఆలోచన. అందుకే ముందుగానే, ఈ ఇంటినికి క్యాంప్ ఆఫీస్ లాగా తయారు చేసుకున్నట్టు చెప్తున్నారు.