నిన్న ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే జగన్ వెళ్లలేదని, ఢిల్లీ నుంచి పిలుపు వస్తే వెళ్ళారని కూడా టాక్ నడుస్తుంది. నిన్న ప్రధాని మోడీని కలిసిన జగన్, అమిత్ షా, నిర్మలా సీతారమాన్ షెకావత్, గడ్కరీ లాంటి కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. అయితే అసలు వీళ్ళను ఎందుకు కలిసారు, ఏమి చర్చించారు అనే విషయం పైన ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఎప్పటి లాగే, స్పెషల్, స్టేటస్, పోలవరం, అప్పులు, విభజన హామీలు అని బ్లూ మీడియా డబ్బా కొట్టినా, అధికారికంగా మాత్రం ఈ సారి కూడా సమాచారం లేదు. అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి మీడియా కంట పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రెండు రోజుల పర్యటనలో, జగన్ మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రధానితో సమావేశం అయిన తరువాత కూడా, బయట మీడియా ప్రతినిధులు ఉన్నా, అటు వైపు కూడా చూడాకుండా జగన్ జారుకున్నారు. ఇంతకు ముందు కూడా, జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినా, ఎప్పుడూ మీడియా నుంచి దూరంగా వెళ్ళిపోయే వారు. మొదటి సారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రమే జగన్ మీడియాతో మాట్లాడారు. అయితే అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తెలిసి తెలియకుండా చెప్పిన మాటలతో నవ్వుల పాలు అయ్యారు.

delhi 06042022 2

అప్పట్లో ఆయన మాట్లాడుతూ, స్పెషల్ స్టేటస్ మెడలు వంచి వాళ్ళని అడిగే పరిస్థితి లేదు. ఢిల్లీ వచ్చిన ప్రతి సారి, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అంటూ, జగన్ చేసిన వ్యాఖ్యలతో, జగన్ ఎంత బలహీనుడు అనే విషయం అర్ధమైంది. దీంతో అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. మీడియా సమావేశం గురించి పక్కన పెట్టినా, అసలు ప్రధానికి కానీ, మంత్రులకు కానీ, జగన్ ఏ మెమోరాండమ్ లు ఇస్తున్నారు అనే విషయం పై కూడా, స్పష్టత ఇవ్వటం లేదు. అసలు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా, లేక పర్సనల్ విషయాలు గురించి చెప్తున్నారా అనేది తెలియటం లేదు. పార్టీ వైపు నుంచి మాత్రం ఒక వాట్స్ అప్ మెసేజ్ మీడియాకు పంపించి, ఢిల్లీలో మెడలు వంచేసాం అని చెప్తారు. దీని పై ఎన్ని విమర్శలు వచ్చినా,న జగన్ మాత్రం మీడియాకు మొఖం చూపించలేదు. అలాగే అమరావతి రైతులు ఢిల్లీలో ఉండటంతో, వాళ్ళు వచ్చి ఎక్కడ తన ముందు ఆందోళన చేస్తారో అని, గట్టి బందోభస్తు పెట్టుకుని, మొత్తానికి మీడియా కంట పడకుండా రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read