చిత్తశుద్ధి లేని శివ పూజలు చేస్తే, ఏమి లాభం ? అలాగే ఉంది జగన్ పరిస్థితి కూడా... మోడీ మీద అవిశ్వాసం అంటాడు, అదే మోడీ ఆఫీస్ లో రోజు వెళ్లి కూర్చుంటారు... ఈయనగారి A2, నేను మోడీని కలుస్తూనే, ఉంటా, ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ మీడియా ముఖంగా చెప్తారు... విపక్షాలు అన్నీ కలిసి పార్లమెంట్ లో మానవహారం చేస్తే, దానికి ఎగ్గొడతారు... ఒక పక్క తెలుగుదేశం కేంద్ర మంత్రులు రాజీనామా చేసి, ఆమోదించుకుని రాష్ట్రానికి వస్తే, వీళ్ళు ఎంపీ పదవికి రాజీనామా అంటారు, కాని ఆ రాజీనామాలు ఆమోదం పొందవు.. విచిత్రం ఏమిటంటే, విజయసాయి రెడ్డి అసలు రాజీనామానే చెయ్యకపోవటం... ఇన్ని చిత్రాలు చేస్తూ, కనీసం మోడీ అనే పేరు కూడా తలవకుండా, కేంద్రం పై యుద్ధం చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇస్తుంటే, ప్రజలు నవ్వుతున్నారు...

jagan 18042018 2

మరో పక్క చంద్రబాబు మోడీని అల్లాడిస్తున్నారు... ఈ నాలుగు ఏళ్ళలో, మోడీని ఎదుర్కునే వాడే లేడు అనుకుంటున్న టైంలో, దేశంలో అన్ని విపక్షాలని ఏకం చేసి, అవిశ్వాసం నుంచి పారిపోయే పరిస్థితి తెచ్చారు చంద్రబాబు... ఢిల్లీ వెళ్లి, ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లు చూపించి మరీ, వాయించి పెట్టారు... అసెంబ్లీ వేదికగా మోడీని దులిపి దులిపి పెట్టారు... రాజకీయంగా కూడా, మోడీ పతనం చూస్తాను అంటూ సవాల్ చేసి మరీ, మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని, మోడీ పైనే యుద్ధం చేస్తున్నారు.. ఈ క్రమంలో, తన పుట్టిన రోజు నాడే, దీక్షకు దిగుతున్నారు. అయితే, చంద్రబాబు ప్రతి చర్యతో, ఒక్కో మెట్టు ఎక్కుతూ, ప్రజల మన్ననలు పొందుతున్నారు. దీంతో జగన్, ఎదో ఒకటి చెయ్యాలని, చంద్రబాబు నుంచి ప్రజలను డైవర్ట్ చెయ్యటానికి ప్లాన్ వేసారు...

jagan 18042018 3

కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో ఇవాళ భేటీ అయ్యారు. ఆగిరిపల్లి మండలం ఈదరలో జగన్‌తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు దీక్ష చేసే రోజే, రాజీనామాలు చేపిస్తే, చంద్రబాబుకు అసలు అటెన్షన్ రాకూడదు అని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే ఎంపీల రాజీనామాతో రాజకీయంగా కలిసొచ్చిందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మరింత మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందుకే చంద్రబాబు దీక్ష రోజే, ఎమ్మల్యేల చేత కూడా రాజీనామాలు చేపిస్తే, చంద్రబాబు వైపు పూర్తిగా అటెన్షన్ రాకుండా చెయ్యగలమని జగన్ భావిస్తున్నట్టు సమాచారం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read