రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటలిజెన్స్ చీఫ్ మనీశ్ తో అత్యవసరంగా భేటీ అయ్యారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో, రాష్ట్రంలో పరిస్థితి పై చర్చించటానికి అని చెప్తున్నా, కరోనాకి పోలీసులుకు ఏమి సంబంధం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిన్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, కేంద్రానికి లేఖ రాస్తూ, తన ప్రాణాలకి ముప్పు ఉంది,భద్రత కల్పించండి అంటూ రాసిన లేఖ పై, జగన్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తుంది. కేంద్ర హోం శాఖకు ఈ లేఖ రాయటంతో, కేంద్ర హోం శాఖ నివేదిక కోరితే, ఏమి చెప్పాలి అనే దాని పై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే, డీజీపీ కూడా, కేంద్రానికి ఇవన్నీ తప్పు అని ఖండిస్తూ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే దాని పై కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాజకీయ వాతవరణం పై కూడా, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి, సమాచారం తెలుసుకున్నారని, తెలుస్తుంది. మరి దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరో పక్క, కరోనా వైరస్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడంతో తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే కేంద్ర పోలీస్ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికలకమిషనర్ రమేష్ కమార్ రాసినట్లు చెబుతున్న లేఖ బుధవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా వర్గాల్లో చక్కర్లు కొట్టిన లేఖలో సారాంశం ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తుందని దీనికి కొంతమంది అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన స్థానిక అధికార యంత్రాంగంతో చేయిదాటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురుండకూడదని ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రులకు పదవీ గండం, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్ల గండం ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం ఆ విధంగా వ్యవహరించడంతో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని, ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలకు చెందిన అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులు
పెట్టారన్నారు.

2014లో ఎంపీటీసీ ఎన్నికల్లో కేవలం 2 శాతం మాత్రమే ఏక్రగీవాలు ఉండగా ప్రస్తుతం 24 శాతం ఏకగ్రీవమయ్యాయని, అదే విధంగా 2014 జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 0.09 శాతం ఏకగ్రీవాలు ఉండగా ఈసారి రికార్డు స్థాయిలో 10 శాతం ఏక్రగీవాలయ్యాయన్నారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు ఇదే నిదర్శనమన్నారు. కడప జిల్లాలో ఎంపీటీసీలకు సంబంధించి 79 శాతం, జెడ్పీటీసీలకు సంబంధించి 76 శాతం ఏకగ్రీవమవ్వడం పరిస్థితికి అద్దం పడుతుందని ఎస్ఈసీ పేర్కొన్నారు. 35 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా 23 చోట్ల వేసిన నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని ఆరోపించారు. అదే విధంగా 55 చోట్ల ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు చేశారని లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విపత్తు కారణంగానే.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము ముందునుంచి చెబుతున్న జాగ్రత్తలను తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖకు పంపినట్లు ప్రచారంలో ఉన్న లేఖలో ఎఈసీ పేర్కొన్నారు. రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ సంచలనం సృష్టించిన ఎస్ఈసీలేఖకు సంబంధించి ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ను స్పష్టత కోరేందుకు ప్రయత్నించినా ఆయన నేను ఈ లేఖ రాసాను అని కాని, రాయలేదు అని కాని చెప్పకపోవటం చూస్తుంటే, ఈ లేఖ ఆయనే రాసినట్టు అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read