గవర్నర్ నరసింహన్‌తో జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పేర్లను గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో 20 మంది మంత్రులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికీ ఆ 25 మంది మంత్రులు ఎవరు..? మంత్రులుగా అవకాశం ఎవరికి దక్కింది..? అనే విషయంలో వైసీపీ అధిష్టానం ఎక్కడా లీకులు కాకుండా చూసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు.
శనివారం ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చెబుతున్నారు. రేపు ఉదయం 11.49 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో జగన్ కార్యాలయం ఉంది. శనివారం రోజు ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందో దాదాపు ఖాయమైంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం జగన్.. ఏ అంశాల ప్రాతిపదికన మంత్రులను నియమిస్తున్నది పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఒకే సారి 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే వారికి ఇప్పటికే వైకాపా అధిష్ఠానం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందుతోంది. దాదాపు ఖరారైన మంత్రుల పేర్లు ఇవే.. ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు), బొత్స సత్యనారాయణ (విజయనగరం), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), మేకతోటి సుచరిత (గుంటూరు), మేకపాటి గౌతంరెడ్డి (నెల్లూరు), కొడాలి నాని (కృష్ణా జిల్లా), కొలుసు పార్థసారధి ( కృష్ణా జిల్లా)