బీజేపిని ప్రసన్నం చేసుకోవాటానికి, జగన్ నానా పాట్లు పడుతున్నారు... ఎలా అయినా, కేసులు నుంచి విముక్తి కోసం, నానా పాట్లు పడుతున్నా, బీజేపి-జగన్ మధ్య సయోధ్య కుదరటం లేదు... దుర్గాష్టమి నాడు RSS,VHP ముఖ్యులతో గోకరాజు ఇంట్లో భేటీ అయిన విషయం తెలిసిందే...
దానికి కొనసాగింపుగా ఇప్పుడు జగన్ చినజియ్యర్ వైపు నుంచి నరుక్కోస్తున్నారు... ముందుగా RSS,VHPని ఒప్పిస్తే, బీజేపి అధిష్టానం కూడా ఒప్పుకుంటుంది అని జగన్ అభిప్రాయం. అందుకే, చినజియ్యర్ ద్వారా, RSS,VHPని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు...
బెంగుళూరు నుంచి సతీ సమేతంగా హైద్రాబాదుకు వచ్చిన జగన్ ఎయిర్పోర్ట్ నుంచి అటునుంచి అటే చిన జియ్యర్ ఆశ్రమానికి వెళ్లారు... జగన్ కి తోడుగా, అన్నిట్లో తోడు ఉండే విజయసాయి కూడా వెళ్లారు... శంషాబాదుకి దగ్గరలో ఉన్న జియ్యర్ ఆశ్రమానికి ఇద్దరూ కలిసి వెళ్లారు.
బీజేపీ, RSS మద్దతు కోసం జగన్ పడరాని పాట్లు పడుతున్నాడు. నెల రోజులు నుంచి ప్రజలకి మొఖం చాటేసి, ఒక్కసారి కూడా ప్రజల ముందికు రాని ఈ ప్రతి పక్ష నాయకుడు, రాజకీయాలు కోసం, కుట్రలు , కుతంత్రాల కోసం, ఎక్కడికైనా వెళ్తాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ....