ఇవాళ శుక్రువారం... ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి స్పెషల్ డే... ఎన్ని పనులు ఉన్నా, ఏ మూడ్ లో ఉన్నా, నాంపల్లి కోర్ట్ కి హాజరు కావాల్సిందే... ఆ క్రమంలో, ఇవాళ కూడా జగన్ నాంపల్లి కోర్ట్ కి బయలుదేరి వెళ్లారు... ఈ క్రమంలో, జగన్ అక్కడ తన దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి జనార్ధన రెడ్డి, తన వల్ల కేసులో ఇరుకున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా హాజరయ్యారు...
అదే సమయంలో అక్కడకి జగన్ కూడా రావటంతో, అందరూ ఎదురు పడ్డారు.. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జగన్ నవ్వుకుంటూ అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు... మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రం, జగన్ మొఖం వైపు కూడా చూడలేదు... జగన్ వల్ల, తనకు ఈ పరిస్థితి వచ్చింది అనే కోపంతో, అప్పటి నుంచి, ఆమెకు జగన్ అంటే అసహ్యం... కాని, మూడో వ్యక్తి జగన్ కు దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి జనార్ధన రెడ్డి మాత్రం, జగన్ దగ్గరకు వెళ్లి, చాలా సేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు... గాలి జనార్ధన రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్ట్ కి హాజరుకాగా, జగన్ తన అక్రమాస్థుల కేసులో కోర్ట్ కి హాజరయ్యారు...
ఇంకో విషయం ఏమిటి అంటే, జగన్ కు ఇవాళ, పాదయత్ర పై క్లారిటీ రానుంది... పాదయాత్ర చేస్తున్నాని, ఆరు నెలలు పాటు, ప్రతి శుక్రువారం కోర్ట్ కి రాను అని, జగన్ సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేశారు... అయితే పోయిన వారం కోర్ట్, సిబిఐ తరుపు వాదనలు విన్నది... ఆ సమయంలో, సిబిఐ జగన్ కు పర్మిషన్ ఇవ్వటానికి అసలు ఒప్పుకోలేదు... జగన్ కు బెయిల్ ఇచ్చిందే, ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాలి అనే షరతుతో అని, అదీను జగన్ కేసు తీవ్రత చాలా ఎక్కువ అని, ఇలాంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు అని సిబిఐ వాదించింది... ఆ పిటీషన్ తీర్పు, కోర్ట్ 20వ తారీఖుకి వాయదా వేసింది, అంటే ఇవాళ... ఆ ఆ పిటీషన్ మీద తీర్పు కోసం, జగన్ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.