కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. అమిత్ షా మూడు రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యకత వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా, పలు రాష్ట్రాల సియంలు తిరుపతి వచ్చి హాజరు కానున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల సియంలు హాజరు అయ్యి, 48 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సహకారంతో పాటుగా, రాష్ట్రాల మధ్య ఉండే విబేధాలు కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గునటానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపి రానున్నారు. ఇందులో భాగంగా ఆయన మూడు రోజుల పటు ఏపిలో ఉంటారు. ఈ రోజు సాయంత్రం అమిత్ షా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎయిర్ పోర్ట్ లో, అమిత్ షా కు స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి రాత్రి రాత్రి 7.40 గంటలకు అమిత్ షా తిరుపతి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం ఎల్లుండి ఉండే అవకాసం ఉంది. రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు అమిత్ షా వెళ్తారు. వెంకటాచలంలో ఆయన పర్యటిస్తారు. స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గుంటారు.
ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా వచ్చారు. ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గుంటారు. రేపు సాయంత్రం దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీ ఉంది. సోమవారం శ్రీవారి దర్శనం చేసుకుని, ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఆతిధ్య రాష్ట్రం కావటంతో జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా కు ఈ రోజు స్వాగతం పలుకుతారు. స్వాగతం అనంతరం జగన్ ఒక్కరే శ్రీవారి దర్శనం చేసుకుంటారనే, ఈ రోజు రాత్రి 11.30 గంటలకు బయలు దేరి, అర్ధరాత్రి ఒంటి గంటకు గన్నవరం రానున్నారు. మళ్ళీ రేపు మధ్యానం ఒంటి గంటకు తిరుపతి వెళ్లనున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదరాబాదరాగా వచ్చి, మళ్ళీ రేపు మధ్యనమే తిరుపతి వెళ్ళటం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పది గంటల టైం ఉంటుంది, ఇలా తిరుపతికి రెండు సార్లు, వెళ్ళటం రావటం ఎందుకని, అనవసరమైన ప్రజా ధనం వృధా తప్ప, ఏమి ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ పడుకునే టైం కదా, ఎందుకు అంత అర్జెంట్ గా, అర్ధరాత్రి ఒంటి గంటకు రావటం మళ్ళీ పది గంటల్లోనే తిరిగి తిరుపతి ప్రయాణం అని ప్రశ్నిస్తున్నారు.
పడేలా చేద్దాం