ముఖ్యమంత్రి కుర్చీ సంకల్ప యాత్రలో జగన్ బ్యాచ్ మాంచి ఫ్లోలో వెళ్తూ, అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలనే లేదు అనే సందేశం ఇవ్వటం కోసం ఎంతో శ్రమిస్తుంది... ఒక పక్క కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఫోటోషాప్ ఎక్స్పర్ట్స్ కి తోడు, బీహార్ బ్యాచ్ ఇచ్చిన స్క్రిప్ట్ కి తగ్గట్టు, డ్రామాలు, డైలాగ్స్ రాసే స్క్రిప్ట్ రైటర్స్ కి కూడా మాంచి డిమాండ్ ఉంది.. వీళ్ళు అంతా పెర్ఫార్మన్స్ బాగానే ఇస్తున్నారు కాని, జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి, కింద స్థాయి కార్యాకర్తల దాకా, అందరూ లాజిక్ మర్చిపోయి, దొరికిపోతున్నారు... నిన్న ఒక 16 ఏళ్ళ అమ్మాయి చేత, రైతుల సమస్యల మీద మాట్లాడించి, పొలాలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఏట్లో అని సమాధానం చెప్పి దొరికిపోయింది.. వీళ్ళు అంటే, పైడ్ ఆర్టిస్ట్ లు కాబట్టి, దొరికిపోయారు.. మరి స్క్రిప్ట్ రైటర్స్ కూడా తప్పులు చేస్తుంటే ఎలా ?

jagan 08112017 2

రెండు రోజుల నుంచి జగన్, తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటన చేస్తున్నాడు... రోజు ఒక సెషన్ ఉంటుంది... అందులో ప్రజలు వచ్చి, ఈ చంద్రబాబు ప్రభుత్వం మాకు ఏమి చెయ్యట్లేదు, మీరు ఎంత తొందరగా ముఖ్యమంత్రి అయితే, మా జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి అనేది స్క్రిప్ట్... ఈ సీన్ అక్కడ పండాలి... దీని కోసం, ముసలి వాళ్ళని, చదువుకునే వారిని, ఇలా అన్ని వర్గాల ప్రజల్ని రప్పిస్తున్నారు.. అందులో రెండు రోజులు నుంచి వారు మాట్లాడుతున్న మాటలు చూస్తూ, చంద్రబాబుని తిడుతున్నారు, బాగానే ఉంది... కాని, బుర్ర పెట్టి ఆలోచిస్తే, వాళ్ళు తిట్టల్సింది చంద్రబాబుని కాదు, సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డిని... లాజిక్ అనేది పూర్తిగా మర్చిపోయి, చంద్రబాబుని తిట్టాలి అనే టార్గెట్ తో, ఏమి చేస్తున్నారో వారికే అర్ధం కాకుండా పోతుంది...

jagan 08112017 3

మా ఊరిలో కరెంట్ లేదు, నీళ్ళు రావు, పెన్షన్లు లేవు, రీఇంబర్స్మెంట్ రాదు అని అంత నిక్కచ్చిగా తను ఓట్లు వేసిన జనాలే చెప్తుంటే, అది ఎవరి తప్పు ? వీళ్ళు చెప్పింది నిజమే అనుకుందాం, అక్కడ ఎమ్మల్యే జగన్ మోహన్ రెడ్డు, ఎంపి అవినాష్ రెడ్డి... అంటే కనీసం పెన్షన్ లు, నీళ్ళు, కరెంటు కూడా వాళ్ళ ప్రజలకి ఇప్పించ లేని స్థితిలో వీళ్ళు ఉన్నారా ? మనం మన ఊరిలో చూస్తూ ఉంటాం, ఒక చిన్న స్థాయి నాయకుడి దగ్గరకి వెళ్లి, పెన్షన్ ఇప్పించుకుంటాం.. అలాగా కరెంటు మిగతా చిన్న సమస్యలు కూడా, ప్రభుత్వం ఎలాంటిది అయినా, ఇలాంటి చిన్న సమస్యలు ఆ ఎమ్మల్యే స్థాయిలోనే తీరిపోతాయి... ఈయన స్వయానా ప్రతి పక్ష నాయకుడు... ముఖ్యమంత్రి తరువాత హోదా ఉండేది ఈయనకే... అధికారులకి ఒక చిన్న ఫోన్ చేసినా, సమస్య తీరిపోతుంది... మరి, ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని అసమర్ధ నాయకుడా, ఈ ప్రతి పక్ష నేత ? ఎమ్మల్యేగా, ఏ సమస్యా పరిష్కరించడా ? ముఖ్యమంత్రి అయితేనే తన సొంత ఊరిలో సమస్యలు పరిష్కరిస్తాడా ? చంద్రబాబుని తిట్టాలి అని, తనను తనే తిట్టించుకుంటున్నాడు అనే విషయం ఈయనకి ఎప్పటికి అర్ధం అవుతుందో ? అయినా ఆ ఊరిలో ఎంత మందికి పెన్షన్ వస్తుందో చూడండి.. సియం డ్యాష్ బోర్డ్ లోకి వెళ్తే, పేరులతో సహా వివరాలు వచ్చేస్తాయి.. ఇంకా ఈయన బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి రాజకీయాలు చేస్తున్నాడు... తప్పదు, ఇంకో ఆరు నెలలు భరించాల్సిందే...

Advertisements

Advertisements

Latest Articles

Most Read