అమరావతి అంటే జగన్ మోహన్ రెడ్డికి ఎంత ద్వేషం ఉందో అందరికీ తెలిసిందే. అమరావతి రాజధానిగా చంద్రబాబు ప్రకటించి, అమరావతిని డెవలప్ చెయ్యటం మొదలు పెట్టిన దగ్గర నుంచి, జగన్ ఎంత విషం చిమ్మరో తెలిసిందే. తన టీవీ, పేపర్ లో, ప్రతి రోజు అమరావతి పై తప్పుడు వార్తలు రాస్తూ, అమరావతిలో భూకంపం వస్తుంది అని, అమరావతిలో వరదలు వస్తాయని, అమరావతి బురద నేల అని, అమరావతి అంటే భ్రమరావతి అని ఇలా, అనేక విధాలుగా అమరావతి పై ద్వేషం చిమ్మారు. అయితే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత గమనించి, అక్కడ ఒక ఇల్లు కట్టుకుని హడావిడి చేసి, మరుసటి రోజే హైదరాబాద్ చేక్కేసారు. జగన్ మోహన్ రెడ్డికి, అమరావతి మీద ఎంత ద్వేషం అంటే, మొదటి సారి అమరావతి వచ్చిన జగన్ ను, అక్కడి రైతులు భోజనానికి పిలిస్తే, నేను రాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అయితే ఇప్పుడు ఢిల్లీ వేదికగా, అమరావతి పై జగన్ మరోసారి విషం చిమ్మారు. అదీ ఢిల్లీ వేదికగా. ఢిల్లీలో ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్‌లో భాగంగా జర్నలిస్ట్ రాహుల్ కన్వల్‌తో వైఎస్ జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా అమరావతి పై అడిగిన ప్రశ్నే ఇందుకు సాక్ష్యం. జర్నలిస్ట్ రాహుల్ మాట్లాడుతూ, మీరు అధికారంలోకి వస్తే, అమరావతిని అలాగే ఉంచుతారా, లేక రాజధానిని మారుస్తారా అని అడగగా, జగన్ మోహన్ రెడ్డి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. అమరావతిలో చంద్రబాబు అవినీతి చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అంటూ ఎప్పుడూ చెప్పే సోదే చెప్పారు కాని, అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తాను అనే మాట మాత్రం చెప్పలేదు.
జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఎంత ద్వేషమో, ఈ దెబ్బతో మరో సారి రుజువైంది. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అంటే, జగన్ మోహన్ రెడ్డికి అంత చులకన. ఒక ప్రతిపక్ష నేతగా వారికి భారోసా ఇవ్వాలి అనే ధ్యాస కూడా లేని వాడు మన ప్రతి పక్ష నాయకుడు. అమరావతి ఆపటానికి కేసులు వేస్తూ, అమరావతి నిర్మాణానికి నిధులు రాకుండా, రుణాలు రాకుండా అడ్డుపడుతూ, అమరావతికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాకుండా చేస్తూ, అమరావతిలో పంటలు తగలబెట్టి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అను నిత్యం, అమరావతి పై విషం చిమ్ముతూ, కుట్రలు పన్నుతూ, ఉండే జగన్ మోహన్ రెడ్డి, మరో సారి అమరావతి పై తనకున్న ద్వేషాన్ని ఢిల్లీ వేదికగా చూపించారు.