జగన్ మోహన్ రెడ్డి పీఆర్ టీం, ఆయనకు తగిలించిన ట్యాగ్ , మాట తప్పడు, మడమ తిప్పడు. పాదయాత్ర చేసే సమయంలో, దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 18 నెలల్లో మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఉన్నారా ? గద్దెనెక్కిన నెల రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా, నేను 45 ఏళ్ళకు పెన్షన్ అని చెప్పలేదు అంటూ, మడమ తిప్పెసారు. అక్కడ నుంచి మొదలై, అనేక సార్లు మడమ తిప్పుతూనే ఉన్నారు. హోదా విషయం దగ్గర నుంచి అమరావతి దాకా, ఇలా ప్రతి విషయంలో గతంలో ఇచ్చిన మాట తప్పారు. అయితే ఇప్పుడు ఇంకా 18 నెలలే అయ్యింది, మేము చెప్పింది చేసి చూపించటానికి ఇంకా టైం ఉంది కదా అని వైసిపీ చెప్తుంది. అయితే ఇప్పుడు మరో విషయంలో జగన్ మాట తప్పారా, లేదా మోసం చేస్తున్నారా అనే చర్చ నడుస్తుంది. అమరావతిని మూడు ముక్కలు చేసే బిల్లులు శాసనమండలి అడ్డుకుంది అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, శాసనమండలిని రద్దు చేసేయటానికి నిర్ణయం తీసుకుంది. దీని కోసం అసెంబ్లీలో తీర్మానం చేసారు. అలాగే తీర్మానం చేసే సమయంలో, శాసనమండలి దండుగ అంటూ దానికి అనేక కారణాలు చెప్పారు. మేధావులు అంతా మనకు అసెంబ్లీలో ఉన్నారని, ఇంకా మండలి ఎందుకు అని ప్రశ్నించారు.

jagan 21112020 2

అలాగే మండలి రద్దు చేయటమే అజెండాగా ఢిల్లీ పర్యటనలు కూడా చేసారు జగన మోహన్ రెడ్డి. మంత్రుల్ని కలిసారు, మండలి రద్దు చేయమని కోరారు. ఇలా అనేక విధాలుగా మండలిని రద్దు చేయాలని కోరారు. అయితే ఎందుకో కానీ ఇంకా మండలి రద్దు కాలేదు. ఏది ఏమైనా ఇప్పటి వరకు, దీని విషయంలో జగన్ కు రిమార్క్ లేదు. అయితే నిన్న తిరుపతి ఎంపీ స్థానంలో అభ్యర్ధిని ప్రకటించే విషయంలో, బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి టికెట్ ఇస్తారని ఆశించినా, తన సొంత ఫిజియోకి సీట్ ఇచ్చారు జగన్. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి, బల్లి దుర్గా ప్రసాద్ కొడుకుకి, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని వైసీపీ చెప్పింది. అయితే ఇక్కడే జగన్ చిత్తశుద్ధిని అందరూ ఎత్తి చూపుతున్నారు. మండలి రద్దు అనేది నిజమా కాదా ? లేదా దాని పై జగన్ వెనక్కు తగ్గారా ? ఒక వేల నిజమే అయితే, ఇప్పుడు బల్లి దుర్గా ప్రసాద్ కొడుకుకి, ఎమ్మెల్సీ హామీ ఎలా ఇస్తారు ? వాళ్ళని మభ్య పెట్టటానికి, ఇలా మోసం చేస్తున్నారా అనే మాటలు వస్తున్నాయి. మరి జగన్ నమ్ముకున్న వాళ్ళని మోసం చేయరు, మడమ తిప్పరు, మాట తప్పరు అనే వాళ్ళు, దీనికి ఎలాంటి సమాధానాలు చెప్తారో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read