ఎన్నికల ముందు వరకు, ప్రత్యేక హోదా సాధిస్తాం, అధికారంలోకి రాగానే మోడీ మెడలు వంచి, ప్రత్యెక హోదా తీసుకోవస్తాం అని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు ఇంకా మన చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఇదే నమ్మారు. చంద్రబాబు తీసుకు రాలేక పోయాడు, జగన్ మోహన్ రెడ్డి మోడీ మెడలు వంచి మరీ ప్రత్యెక హోదా తీసుకువస్తారు అని నమ్మి, ఏకంగా 22 ఎంపీలను గెలిపించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం, అందరికీ షాక్ ఇస్తూ, మోడీ గారితో మొదటి సమావేశం అయిన తరువాత, బయటకు వచ్చి మీడియా అడిగిన ప్రశ్నకు, మోడీ గారిని అడుగుతూనే ఉందాం, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుతూనే ఉందాం అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. మెడలు వంచుతా అన్న వ్యక్తి, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని చెప్పటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కేంద్రం మాత్రం, ఆంధ్రప్రదేశ్ విషయంలో తన వైఖరి మార్చుకోలేదు. చంద్రబాబు ఎదురు తిరిగి, దేశమంతా తిరిగి అల్లరి చేస్తేనే పట్టించుకోని మోడీ, జగన్ గారు ప్లీజ్ సార్ ప్లీజ్ అంటే పట్టించుకుంటారా ?

బడ్జెట్ లో కూడా, విభజన చట్టంలో పెట్టిన విషయాల పై కనీసం ప్రస్తావన లేదు. తాజాగా, జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రత్యెక హోదా ఎప్పుడు ఇస్తున్నారు అన్న, ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరుగునపడిందని మరోసారి స్పష్టం చేసారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేదే లేదని, హోదాకు బదులుగా ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే జగన్ మాత్రం, ఈ విషయం పై మౌనంగా ఉన్నారు. కనీసం స్పందించటం లేదు. పార్లిమెంట్ లో చించేస్తాం, పొడిచేస్తాం అని చెప్పిన వైసీపీ ఎంపీలు, కేంద్రం పై ఒక్క మాట కూడా అనకుండా, ఏ పోరాటం చెయ్యకుండా కూర్చున్నారు. మొత్తానికి జగన గారు అనుసరిస్తున్న విధానం, రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తుందో, కాలమే సమాధానం చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read