ట్యాక్స్ ఎగ్గొట్టి, విదేశాల్లో వేల కోట్లు నల్ల డబ్బు దాచుకున్న "ప్యారడైజ్ పేపర్స్" జాబితా లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 714 మంది పేర్లులో, స్థానం సంపాదించి రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, మొదలు పడదాం... ఒక పక్క మన ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ఇమేజ్ పెంచుతుంటే, ఈ దొంగల బ్యాచ్, మన రాష్ట్ర పరువు అంతర్జాతీయ స్థాయిలో తీస్తుంది... పోయిన ఏడాది "పనామా పేపర్స్"లో, జగన్ బినామీ రాంప్రసాద్ రెడ్డి గుట్టు రట్టు చేసేంది....2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ఆరెంజ్ గ్లో లిమిటెడ్ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. అడ్రెస్ గా హైద్రాబాద్ సిద్దార్థ్ నగర్ లోని ప్లాట్ నంబర్ 46 ని ఇచ్చారు. తీరా ఆరా తీస్తే ఆయన అరబిందో ఫార్మాలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని విజయసాయి రెడ్డికి వియ్యండుకు కూడా అని నిర్ధారణ అయ్యింది... ఇప్పుడు తాజాగా "ప్యారడైజ్ పేపర్స్"పేరిట ఏకంగా జగన్ గుట్టే బయట పడింది...
ఇండియన్ ఎక్ష్ప్రెస్స్, ICIJ ఇన్వెస్టిగేషన్ లో, తాజాగా చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు సిబిఐ కూడా పట్టుకోలేదని, జగన్ చేసిన మోసాలు ఇంకా చాలా ఉన్నాయి అంటుంది.. పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తున్నాం అని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 దేశాలకు సంబంధించి, 13.4 పత్రాలు అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పింది... పూర్తి వివరాలు ఇక్కడ అప్లోడ్ చేస్తాం అంటుంది https://www.icij.org/investigations/paradise-papers/ బహుసా, సాయంత్రంలోపు, మనోడు చేసిన మరిన్ని ఘనకార్యాలు మనం తెలుసుకోవచ్చు... ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం జగన్ గురించి ఇలా రాసి ఉంది "fresh financial links in a CBI case against YSR Congress Chief YS Jagan Mohan Reddy"
ఇది వరకు జగన్ అక్రమాలను పనామా పేపర్స్ గుట్టురట్టు చేశాయి. అప్పుడు పనామా పేపర్స్ ఉదంతంలో రాంప్రసాద్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. రామ్ ప్రసాద్ రెడ్డి విజయసాయి రెడ్డికి బినామీ. విజయసాయి రెడ్డి జగన్ కు బినామీ అని అందరికీ తెలుసు. మొత్తంగా తేలిందేమిటంటే పనామా బయట పెట్టింది జగన్ బినామీ పేరిట పెట్టిన పెట్టుబడుల విషయమే. మనీలాండరింగ్ ద్వారా బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్‌కు పంపిన గుట్టును పనామా పత్రాలు ధ్రువీకరిస్తున్నాయన్నారు. ఇప్పుడు "ప్యారడైజ్ పేపర్స్" లో ఏమి కొత్త విషయలు తెలుస్తాయో చూడాలి... ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం సిబిఐ కూడా పట్టుకోలేదని, జగన్ చేసిన మోసాలు ఇంకా చాలా ఉన్నాయి అంటుంది.. చూద్దాం... ఇది ఇలా ఉండగా, 11 A1 కేసులు వెనక పెట్టుకుని, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతకం పెట్టి వస్తూ, ఇవాల్టి నుంచి పాదయాత్ర అంటూ ప్రజల్లోకి రానున్నారు జగన్...