2019 ఎన్నికలకు ప్రచార సమయంలో జగన్, వారి పార్టీ నేతలకు బాగా పనిచేసి వైసిపిని అధికారంలోకి తీసుకొస్తే ఆ మంత్రి పదవి ఇస్తాను, ఈ మంత్రి వదవి ఇస్తాను అని చాలా ఆశలే కలిపించారు. కాని వారిలో చాలా మందికి ఇప్పుడు జగన్ మొండి చెయ్యి చూపించారని తాజాగా జగన్ చేసిన కాబినెట్ విస్తరణతో అర్ధమైంది. పార్టీలో చాలా మందే మంత్రి పదవులు కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కాని వారందరికి నిన్నటి జగన్ చర్యతో నిరాశే ఎదురైందని చెప్పాలి. ఈ కోవకే చెందుతారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. 2019 లో ఎన్నికలకు చేసిన ప్రచారంలో నారా లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తా అంటూ ఆనాడు జగన్ చేసిన ప్రచారంతో, ఆళ్ల రామకృష్ణారెడ్డికి జనంలో ఉన్న ఫేం వల్ల ఆళ్ల గెలిచారు. అ తరువాత జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తారని అందరూ అనుకున్నారు. కాని జగన్ మాత్రం మొదట కాబినెట్లో ఆళ్ల కు చోటు ఇవ్వలేదు. కనీసం రెండోసారి ఏర్పాటు చేసిన కాబినెట్ లో అయిన సీటు ఇస్తారనుకుంటే కనీసం ఆయన ఊసే జగన్ ఎత్తలేదు.
ఈ జాబితాకే చేరుతారు చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. ఆయన పార్టీ కోసం చాలా ఖర్చే చేసారని సమాచారం. అయితే ఈయన్ని కాదని విడుదల రజనికి ఇవ్వటం పై మర్రి అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఆనాడు ఎన్నికల ప్రచారంలో విడదల రజనీని గెలిపిస్తే, మర్రి రాజశేఖర్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని ప్రమాణాలు కూడా చేసారు. మంత్రి పదవే కాదు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదని, జగన్ ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదని మర్రి వర్గీయులు విరుచుకు పడుతున్నారు. ఇలా వీరిద్దరే కాదు , జగన్ ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా కొంతమందికి కూడా మంత్రి పదవులు ఇస్తానని ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఇప్పుడెమో వారందరికి అన్యాయం చేయడంతో జగన్ కు తన సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ మొదలయింది. నమ్మించి మోసం చేయటంలో జగన్ దిట్ట అనే పేరు తెచ్చుకున్నారు..