ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి బయలురి.10.50 నిమిషాలకు నరసాపురం చేరుకుంటారు. ఆ తరువాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే జగన్ పర్యటనలకు బయటకు వచ్చిన ప్రతిసారి ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు.. అయితే జగన్ ఈ నరసాపురం పర్యటనకు కూడా అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. ఈ పర్యటన కోసం రెండు వేల మంది బందోబస్తుని ఏర్పాటు చేసారు. దారి పొడుగునా బారికేడ్లు ఏర్పాటు చెయ్యడం కోసం అడ్డుగా వున్న పెద్ద పెద్ద చెట్లను కూడా నరికివేశారు.. అయితే భీమవరంలో ఇపటికే టీడీపీ, బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు చేసారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు. అయితే కారణాలు చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోలీసులు తీసుకెళ్లడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు.. అయితే ఇప్పుడు నరసాపురం మొత్తం పోలీసుల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది.
జగన్ దిగే హెలిప్యాడ్ నుంచి సభా స్థలం వరకు హోటళ్లు, దుకాణాలు మొత్తం మూయించేసారు.. డ్వాక్రా సంఘాలకు , వాలంటీర్లు కు సభకు వీలయినంత ఎక్కువమందిని తీసుకు రావాలని బీమవరం వైసిపి టార్గెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.. ఈ సభ కోసం జనాలను తీసుకురావడానికి 750 బస్సులను కూడా ఏర్పాటు చేసారు. అయితే ఈ పర్యటన పై చంద్రబాబు స్పందించారు.. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశామని, కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను...అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని,మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు...చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే. నువ్వు జగన్ రెడ్డి కాదు...రివర్స్ రెడ్డి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి? అని చంద్రబాబు ట్వీట్ చేసారు.