ఉన్నట్టు ఉండి, రెండు రోజుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పాదయత్రని ఎన్డీటీవీ కవర్ చేస్తుంది.. వరసుగా రెండు రోజులు కవర్ చేసారు... దీని వెనుక పెద్ద స్టొరీ ఉంది... అది తరువాత మాట్లడకుందాం... ముందుగా, ఇక్కడ ఎంత కవర్ చేసుకున్నా, జగన్ ఘనకార్యాలు గురించి మాత్రం, బహిర్గతం చెయ్యకుండా ఉండలేక పోతున్నారు... మనోడి టాలెంట్ అలాంటింది మరి... ఎన్డీటీవీ ఇంటర్వ్యూ లో, జగన కు చాలా ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది... ఎప్పటిలాగే, ఇది చంద్రబాబు కుట్ర అని తప్పించుకున్నాడు అనుకోండి... కాని అక్కడ యాంకర్ ప్రశ్న అడిగిన విధానం చుస్తే, మనోడి ఖ్యాతి ఏంటో తెలుస్తుంది...
యాంకర్ ప్రశ్న "చంద్రబాబు గురించి సరే, ఇప్పుడు మీ కేసులు గురించి ప్రశ్నలు అడుగుతా... ఇవి అడగటానికి, ప్రింట్ అవుట్ తీసుకుని మరీ రావాల్సి వచ్చింది (అన్ని కేసులు ఉన్నాయి, నీ మీద అని సటైర్ వేసాడు)... లిస్టు చదువుతున్నా, మీ మీద 11 చార్జ్ షీట్స్ ఉన్నాయి... అందులో, చీటింగ్ కు సంబంధించి 9 కేసులు ఉన్నాయి... క్రిమినల్ కాన్స్పిరసీ, డాకుమెంట్స్ ఫోర్జరీ, ఇంకా ఎన్నో నేరాలు చేసిన ఆరోపణలు ఉన్నాయి.. ఇవన్నీ చాలా తీవ్రతతో ఉన్న కేసులు, వీటికి ఏమి సమాధానం చెప్తారు" అని అడిగారు...
ఈ సమయంలో జగన్ హావభావాలు అయితే హైలైట్... అప్పటికే, ఆపెయ్యమని, ఆ యాంకర్ భుజం తడుతూ ఉన్నాడు, మరో వైపు మనోడి ఇది ట్రాక్ రికార్డు, టకటక ఎన్డీటీవీ చదువుతుంటే, ఆ రియాక్షన్ చూడండి... ఎవరన్నా, ప్రజలకు ఇది చేసాం, అది చేసాం అని చెప్పుకుంటారు... బహుశా ఈ ప్రపంచంలోనే మొదటి రాజకీయ నాయకుడు ఏమో, ప్రజలకు ఏమి చేసాడో చెప్పటానికి ఒక్కటి లేదు, చివరకు సొంత ఊరికి కూడా... కాని, ప్రజలను ఎలా మోసం చేసాడో చెప్పటానికి, ఆ కేసులు గురించి చెప్పటానికే, 5 నిమషాలు పట్టింది... మీరు చూడండి...