ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఓటింగ్ అనంతరం తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని ఆరోపిస్తున్నారని, అయితే వైసీపీ మూకల చేతిలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న మాదిరిగా చనిపోకూడదనే జాగ్రత్తతో దూరంగా ఉన్నానని చెప్పారు. తన కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేశారని, సోషల్మీడియాలోనూ అసభ్యంగా దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని, తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్ల పథకం అనేది పెద్ద కుంభకోణం అని, జగనన్న ఇళ్ల పథకంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఎస్సీలను అణగదొక్కేందుకు దాడులు చేస్తున్నారని, చంపుతున్నారు, సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. రహస్య బ్యాలెట్లో ఎన్నికలు జరిగితే తానే క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డానని ఆరోపిస్తూ వైసీపీ గూండాలు వేధిస్తున్నారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసే ఏపీలో అడగుపెడతానని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు.
జగన్ పైన నెగటివిటీని, సజ్జల పై తోసేసే ప్లాన్ వేసారా ?
Advertisements