అప్పుచేసి పప్పు కూడు తింటారంటారు సామాన్య జనం. జగన్ రెడ్డి మాత్రం అప్పుచేసి ఖరీదైన కార్లు కొంటున్నారు. ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించలేరు. అభివృద్ధి పనులపై వెచ్చించేందుకు రూపాయి కూడా లేదని చెబుతోన్న ప్రభుత్వం జనం సొమ్ము 16 కోట్లతో 19 కొత్త కార్లు కొనుగోలు చేసింది. ఇవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం అని వేరే చెప్పక్కర్లేదు. టయోటా ఫార్చ్యూనర్ కంపెనీకి చెందిన 19 హైఎండ్ కార్లు కొనుగోలు చేసిన సర్కారు వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దుతోంది. నిరంతరం తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటూ, పెళ్లిళ్లు, పేరంటాలకు హెలికాప్టర్లో వెళ్లే జగన్ రెడ్డికి ఈ కొత్త కార్లు ఎందుకో అనేది అంతు చిక్కని ప్రశ్న. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కొత్త కాన్వాయ్ కోసం కోట్లు వెచ్చించారు. జిల్లాల పర్యటన కోసం అత్యంత ఖరీదైన బస్సు కొనుగోలు చేశారు. జనం సొమ్ముతో జగన్ విలాస ప్రయాణాల అవసరం ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. అయితే విశాఖ నుంచి పరిపాలన ఆరంభించాలని, రుషికొండపై కట్టే సీఎం క్యాంప్ ఆఫీసు అడ్డంకులు అధిగమించి పూర్తయితే..ఈ కొత్త కాన్వాయ్‌తో కొత్త రాజధాని విశాఖలో సీఎం ప్రయాణాలు సాగించేందుకు వినియోగిస్తారని సమాచారం. మరోవైపు పవన్ కల్యాణ్ కాన్వాయ్ కోసం నలుపు రంగు వాహనాలు తెప్పించడం, పోటీగా జగన్ జనం సొమ్ముతో ఇవి తెప్పించారని మరో వాదనా వినిపిస్తోంది.
జనం సొమ్ము 16 కోట్లతో 19 కొత్త కార్లు జగన్ ఎందుకు కొన్నారు ?
Advertisements