రాష్ట్రంలో మార్పు తీసుకు వస్తా, ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చేస్తా, అసెంబ్లీని ఎంతో పవిత్రంగా చూస్తా అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు, అది ఆచరణలో మాత్రం చూపించటం లేదు. ఈ రోజు నుంచి ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తూ, తెలంగాణా వేసిన ఎత్తుగడకు, జగన్ మోహన్ రెడ్డి సై అనటం పై, ఏపికి తీవ్ర నష్టం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు జగన్ వెళ్ళటం పై, చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మొన్నటి దాక గాడిదలు కాస్తున్నావా అంటూ చంద్రబాబు పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. అయితే నిజానికి చంద్రబాబు సియంగా ఉన్న సమయంలో, కాళేశ్వరం పై తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కట్టటానికి వీలు లేదని, ఏపి నష్ట పోతుందని కేంద్రానికి లేఖ రాసారు. అదే లేఖ పట్టుకుని, కేసీఆర్, ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు తెలంగాణా ద్రోహి అన్నారు.
కాని ఈ రోజు జగన్ మాత్రం, అవేమీ పట్టించుకోకుండా, చంద్రబాబు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అడ్డు చెప్పనట్టు, కాళేశ్వరంని చంద్రబాబె దెగ్గర ఉండి కట్టించినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో, ఆ రోజు ప్రాజెక్ట్ అడ్డుకోకుండా, ఏ గాడిదలు కాస్తున్నారు అంటూ అభ్యంతరకర భాష వాడారు. అదే సందర్భంలో, ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కూడా ఇదే రకమైన భాష మాట్లాడుతూ, "దొబ్బలేదు" అంటూ మాట్లాడారు. పోలవరంపై రెండు లిఫ్ట్ లు ఏర్పాటు చేసి 400కోట్లు దోబ్బేశారంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ భాష పై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పింది. కాని వివేమీ పట్టించుకోకుండా, అధికార పక్షం ముందుకు వెళ్ళింది. అసెంబ్లీ వేదికగా ఇలా మంత్రులు, ముఖ్యమంత్రే ఇలాంటి భాషలు మాట్లాడుతుంటే, ఇక సోషల్ మీడియాలో, బయటా రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలకు అడ్డు ఏమి ఉంటుంది.