దేశం అల్లకల్లోలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ రోజుకి బ్రతికితే చాలు, వైరస్ బారిన పడకుండా ఉంటే చాలు అంటూ, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థతిలో ప్రజలు ఉన్నారు. అయితే భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకో చేస్తున్నారో తెలియదు, అసలు ఏ ఉద్దేశం ఉందో తెలియదు, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు పెట్టి తీరుతాం అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. పిల్లలు, పెద్దలు, ప్రతిపక్ష పార్టీలు, పరీక్షలు పెట్టద్దు బాబోయ్ అంటున్నా, ప్రభుత్వం మాత్రం వినిపించుకోవటం లేదు. ఏది ఏమైనా పరీక్షలు పెట్టి తీరుతాం అని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ విషయం పై మొదటి సారి జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు స్పందించారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇది సరి కాదని అన్నారు. నేను ప్రతి విద్యార్ధి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుంటే, విపత్కర పరిస్థితి అంటూ కొంత మంది విమర్శలు చేస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పాలసీ ఉండాలని లేదని, కేంద్రం కూడా పరీక్షలు పెట్టుకునే విషయం, రాష్ట్రాలకు వదిలేసిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు.
పరీక్షలు జరిపి తీరుతాం అని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని, జగన్ మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. అయితే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పై పలువురు ఆశ్చర్య పోతున్నారు. సర్టిఫికేట్ లు కంటే, ప్రాణాలు ముఖ్యం అని పరిస్థితిలో ప్రస్తుతం దేశం ఉందని, ఇలనాటి పానిక్ పరిస్థితిలో, పరీక్షలు ఎలా రాయగలరని, 15 లక్షల మంది విద్యార్ధులు అంటే, ఎన్ని కుటుంబాలు భయం భయంతో ఉండాలో ఆలోచించాలని అన్నారు. ఒక పక్కన ఆంక్షలు విధిస్తూ, మరో పక్క పరీక్షలు పెట్టటం ఏమిటో, అసలు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఈ నిర్ణయం సమర్ధించుకోవటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు రద్దు చేయకుండా, కనీసం వాయిదా అయినా వేయటానికి, ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, ఇదే అంశం పై ఇప్పటికే నారా లోకేష్, గత వారం రోజులుగా, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు. మరో పక్క రఘురామకృష్ణం రాజు, ప్రధాని మోడీకి కూడా లేఖ రాసారు. ఇక కేఏ పాల్, ఇదే విషయం పై హైకోర్టులో కేసు కూడా వేసారు.