నంద్యాలలో జరిగిన అబ్దుల్ సలాం కేసు విషయం అందరికీ తెలిసిందే. సేల్ఫీ వీడియో బయటకు వచ్చి, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు గొడవ చేయటం, తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వటంతో, ఘటనకు బాధ్యత వహిస్తూ, సిఐ, కానిస్టేబుల్ పై కేసులు పెట్టి కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. అయితే ఆ కేసులో 12 గంటల్లోనే బెయిల్ వచ్చింది. అరెస్ట్ చేపించాం అని ప్రచారం చేసుకున్నంత సేపు కూడా, వాళ్ళు జైల్లో లేరు. సహజంగా పెట్టే కేసులు బట్టి, పోలీసులు తరుపు వాదించే న్యాయవాదులను బట్టి, కోర్టులో జడ్జి బెయిల్ పై నిర్ణయం తీసుకుంటారు. నిందితులకు బెయిల్ వచ్చింది అంటే అది నిందితుడు తరుపు న్యాయవాది వాదన కంటే, దర్యాప్తు సంస్థలు బలంగా వాదించలేదని, పెట్టన సెక్షన్ లకు, సరైన ఆధారాలు కోర్టుకు చూపించలేదని అర్ధం. అయితే, చివరకు ఈ విషయాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది. తమ అసమర్ధ పాలనతో , ఒక పక్క కుటుంబం మొత్తం చనిపోతే, ఆ విషయం పట్టించుకోకుండా, అరెస్ట్ అయిన పోలీసులు తరుపున వాదనలు వినిపించింది తెలుగుదేశం లాయర్ అంటూ, అసంబద్దమైన వాదన తీసుకుని వచ్చారు. ఘటన ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎందుకు ఇన్నాళ్ళు వారిని అరెస్ట్ చేయలేదు, మూడు నెలల నుంచి వేధిస్తుంటే ఏమి చేస్తున్నారు, ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోవటానికి కారణం ఎవరు అనే ప్రశ్నలకు వైసిపీ దగ్గర సమాధానం లేదు. న్యాయవాది టిడిపి అంటూ కొత్త వాదన తెచ్చారు. వృత్తిలో భాగంగా న్యాయవాదులు విధ రకాల కేసులను వాదిస్తూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి పక్కన ఉండే లాయర్ జంధ్యాల రవి శంకర్, ఇప్పుడు అమరావతి తరుపున వాదిస్తున్నారు.

jagan 11112020 2

అంటే రాజశేఖర్ రెడ్డి కలలోకి వచ్చి చెప్తే, రవి శంకర్ ఈ కేసు వాదిస్తున్నారా ? బీజేకి బద్ధ శత్రువు అయిన ఎంఐఎం పార్టీ ఓవైసికి పర్సనల్ లాయర్ గా నిన్న బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ ఉన్నారు. అంటే మోడీ చెప్తే ఈయన పని చేస్తున్నారా ? న్యాయవాదులకు, రాజకీయాలకు ముడిపెట్టి ఏకంగా జగన్ మోహన్ రెడ్డి గారే, ఈ వాదన ఒక ముఖ్యమంత్రి హోదాలో తేవటం ఆశ్చర్యకరం. రిమాండ్ రిపోర్టును బలహీనంగా పెట్టిన పోలీసులది ఏ తప్పు లేదు కానీ, బెయిల్ పిటీషన్ పై వాదిస్తున్న వారి తప్పు అని, ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి, కుటుంబం మొత్తం పోయినా, ఏమి మాట్లాడకుండా ఉండాలని చెప్తున్నారా ? తెలుగుదేశం కాకపొతే జనసేన అడుగుతుంది, జనసేన కాకపోతే ముస్లిం సంఘాలు అడుగుతాయి. ప్రతిది ఇలా ఎదురు దాడి చేసి తప్పించుకుంటే ఎలా ? న్యాయమూర్తులు పై ఇలాగే దాడి చేసారు. ఇప్పుడు న్యాయవాదులు తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు, డాక్టర్లు తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు అనే వాదన ఏమిటి ? ప్రభుత్వంలో ఉండి, బలమైన కేసులు పెట్టకుండా, బలమైన రిమాండ్ రిపోర్ట్ రాయకుండా, బలమైన వాదనలు వినిపించకుండా, ఇలా ముఖ్యమంత్రి, ఇలాంటి వాదనలు వినిపించి, తమ తప్పు కనపకుండా చేయటం ఎంత వరకు న్యాయం ? ఎంత సేపు తెలుగుదేశం మీద, న్యాయమూర్తులు మీద, వ్యవస్థల మీద ఎదురు దాడి చేసి, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుతారు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read