పరిటాల రవి... ఈ పేరు వింటే, నిద్రలో కూడా లెగిసి వనికిపోయే జీవులు ఇప్పటికీ ఉన్నారు.. వారిలో మొదటి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పరిటాల ఉండగా ఆయన వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే జగన్, ఇప్పుడు పెద్ద పోటుగాడిలా పరిటాల రవి సతీమణి పరిటాల సునీత మీద ఛాలెంజ్ చేస్తున్నాడు... అక్కడకు వెళ్లి రెచ్చగొడుతున్నాడు... పరిటాల రవి ఉంటే తన ఆటలు సాగవు అని, పరిటాల రవిని చంపటానికి ముందు 140 మంది రవి అనుచరులని చంపి, చివరకి పరిటాల రవిని కూడా చంపిన రాక్షస జాతి, ఇవాళ ఆడవాళ్ళ మీద ఛాలెంజ్ చేస్తున్నాడు... అనంతకు పరిటాల కుటుంబం ఏమి చేస్తాడు అని అడుగుతున్నారు... ఫాక్షన్ ప్రోత్సహిస్తుంది అని అంటున్నాడు.... ఇక్కడ జగన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కుటుంబం ఫాక్షన్ ప్రోత్సహిస్తే, మొదట లేగిసే తలకాయి ఎవరిదో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు...
అప్పుడు పరిటాల పోరాడింది ఇలాంటి వారి మీదే.. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగపోతే అక్కడ సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది... అలాంటి వ్యవస్థలో నుంచి పుట్టిన శక్తే మన పరిటాల రవి... అతని చుట్టూ ఉన్నవారు, అతని చేత రక్షింపబడ్డవారు ఆయన కులం కాదు, ఆయన మతం కాదు... ఆయనకి కనిపించిందల్లా ఒక్కటే అన్యాయనికి ఎదురు నిలపడటం, ఎదురించటం, అణచటం... అందుకే రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో పోరాడాడు... పులివెందుల నుంచి వచ్చిన కరుడగట్టిన ఫాక్షన్ నాయకులను ఎదిరించాడు. పరిటాలని చూస్తే పారిపోయే పిల్లగాడు జగన్.... కాని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అరాచకం చేశాడు...
పరిటాల రవి సహా, ఆయన అనుచరులని 70 మంది కిరాతకంగా చంపింది ఈ రాక్షస జాతి... ఆ మనిషిని చంపితేనే నేను బ్రతకగలను అనే పిరికి వాడు, ఇప్పుడు విర్రవీగుతున్నాడు... "పరిటాల రవి" అనేది ఒక వ్యక్తి కాదు ..అది ఒక "ఆలోచన"... ఒక "సిద్ధాంతం"... దాని ఆశయం "సామాజిక సమానత్వం"... ఆ ఆలోచనకున్న " ధృడత్వం", దాని వెనుకున్న "సంకల్పం" , సమానత్వం కోసం తపించే ప్రతి మదిని కదిలిస్తూనే వుంటుంది.... ఆ "ఆలోచన"కు ఎందరు ఎన్ని వక్రభాష్యాలు ప్రచారం చేసినా, ప్రజల మది నుండి మాత్రం చెరపలేకున్నారు.. నేటికీ ఎల్లలు లేని అభిమానమే చాటుతుంది, ఆ " నాయకత్వ " బలమేంటో... ఆ కుటుంబం ఫాక్షన్ వదిలేసే అనంత బంగారు భవిష్యత్తు కోసం పని చేస్తుంది... నీకు ప్రజా క్షేత్రంలోనే సమాధనం దొరుకుతుంది జగన్...