జగన్ మోహన్ రెడ్డి తన స్థాయిని కూడా మరిచి, ఇంకా రోడ్డు మీద పాదయాత్రలో తిరిగే నాయకుడుని అనుకుంటూ, ప్రతిపక్షాల పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, తన హోదాని దిగజారుస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా నోరు తెరవని జగన్ మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం పై, తన పైన వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూ, వ్యక్తిగత విమర్శలు, అదీ తీవ్రంగా చేసి, అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం పై, టీవీలు చేసే వారే కాదు, అక్కడ ఉన్న వైసిపీ మంత్రులు, ఎమ్మేల్యేలు కూడా అవాక్కయ్యారు. జగన్ మోహన్ రెడ్డి, ఒక సియం హోదాలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, ఎవరూ ఊహించలేదు. రాష్ట్ర ప్రభుత్వ, తెలుగు మీడియంని పూర్తిగా ఎత్తేస్తూ, అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడుతూ, ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఒకేసారి ఇలా మార్చేస్తే, ఎలా అని, అదీ కాక, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చదువుకుంటారని, తెలుగు భాషని కాపాడే విధంగా ఉండాలని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందిస్తూ, గతంలో మేము ఆప్షన్స్ ఇచ్చామని, మీరు ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, తెలుగు భాషని కాపాడుకోవాలని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, వరుస ట్వీట్లతో ఈ అంశం పై స్పందించారు. ఇక నిన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, మాతృభాషని కాపాడాలని, ఒక వ్యాసం రాసారు. అయితే అది తెలుగు ఒక్కటే కాదు, దేశంలో ఉన్న అన్ని భాషల గురించి రాసారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి తన కోసమే రాసారని, బుజాలు తడుముకున్నారు. మరో పక్క అన్ని పేపర్లు కూడా, ఈ విషయం పై ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీని పై ఈ రోజు జగన్ స్పందిస్తూ, తన అక్కసును వెళ్ళగక్కారు. ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, ఎలా చేస్తాం అనేది వివరంగా చెప్పకుండా, ఎదురు దాడి చేసారు. అది కూడా వ్యక్తిగత దాడి.
వెంకయ్య నాయుడు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు. అంటూ, డైరెక్ట్ గా ఉప రాష్ట్రపతి పైనే వ్యాఖ్యలు చేసారు. నిజానికి వెంకయ్య, ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై స్పందించలేదు. కేవలం మన దేశంలో ఉన్న అన్ని భాషల గురించి వ్యాసం రాసారు. అయితే జగన్ మాత్రం తనకు ఆపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై అయితే, తీవ్రంగా వ్యక్తిగత దాడి చేసారు. అయ్యా సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ గారు.. పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు... నలుగురో ఐదుగురో పిల్లలు కూడా ఉన్నారు, వారు ఎక్కడ చదువుతున్నారు అంటూ ప్రశ్నించి, సమస్య పై స్పందించకుండా, వ్యకిగత దాడి చేసారు. అలాగే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అయితే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఇలా మనసులో ఉన్నది ఉక్రోషంతో కక్కేస్తూ, వ్యాఖ్యలు చెయ్యటం పై, మాత్రం, జగన్ వైఖరిని ఆక్షేపించక తప్పదు. రేపు పవన్ కళ్యాణ్ కూడా, జగన్ కుటుంబ సభ్యుల పై, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఏమి చేస్తారు ?