కేంద్ర ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు, ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం, ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన రాష్ట్రాల హక్కులను, కేంద్రం నెమ్మదిగా తమ అధీనంలోకి తెచ్చుకోవటం. ఈ మధ్య కాలంలో అనేక నిర్ణయాలు రాష్ట్రాలు విమర్శలు చేస్తున్నాయి. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి నిర్ణయమే ఇప్పుడు కేంద్రం మరొకటి తీసుకుంది. అదే ఐపిఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవటం. దీని కోసం కేడర్ రూల్స్ ని మార్చేస్తున్నారు. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులను ఎప్పుడు కావలి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనక్కు పిలిపించుకోవచ్చు. అయితే కేంద్రం తీసుకునే ఈ నిర్ణయాన్ని, బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలించే రాష్ట్రాల్లో ఎలాగూ వ్యతిరేకించరు. కేవలం మిగతా బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం చేతుల్లోకి వెళ్తే, ఇక రాష్ట్రాల్లో తమకు ఇష్టం వచ్చినట్టు కేంద్రం చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీ బలంగా లేని చోట, అంటే మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, ఇలాంటి చోట్ల, కేంద్రం ఇష్టం వచ్చినట్టు చేసే అవకాసం లేక పోలేదు. అందుకే బీజేపీయేతర రాష్ట్రాలు అన్నీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతికేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి కూడా.
బీహార్, తమిళనాడు తో పాటుగా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ జార్ఖండ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం నిర్ణయం పై ఎదురు తిరిగాయి. తాజాగా తెలంగాణా రాష్ట్రం కూడా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పైన తమ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకత చెప్పినా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఎలాంటి ప్రకటన కాని, లేఖ కాని కేంద్రానికి రాయలేదు. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత చెప్పటం లేదు. మరీ ముఖ్యంగా ఇది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శాఖ కావటంతో, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేకంగా సాహసం చేయలేదు. కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతుందని తెలిసినా కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రాల హక్కులు కేంద్రానికి ఇచ్చేస్తూ పొతే, ఇప్పుడు జగన్ సొంత నిర్ణయాలు కోసం చేసే ఈ పనులు, రేపు ప్రభుత్వాలు మారిన తరువాత ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచన చేయకుండా, ఇలా చేయటం పై విమర్శలు వస్తున్నాయి.