వ్యాక్సిన్, వ్యాక్సిన్, వ్యాక్సిన్... ప్రస్తుతం, క-రో-నా విపక్తర పరిస్థితి నుంచి మనల్ని కాపాడేది, కేవలం వ్యాక్సిన్ మాత్రమే అని అందరికీ తెలిసిందే. ప్రాణాపాయం నుంచి 99.99 శాతం వ్యాక్సిన్లు గట్టేక్కిస్తాయని పరిశోధనలు చెప్పటంతో, ఇప్పుడు ప్రజలు అందరూ వ్యాక్సిన్ ల కోసం ఎదురు చూస్తున్నారు. 15 రోజులు క్రితం వరకు కేంద్రమే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపించేది. ఇప్పుడు 50 శాతం వరకు రాష్ట్రాలు ఆయా సంస్థల నుంచి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చని చెప్పింది. ఇక్కడ వరకు బాగనే ఉంది. అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాలు, ఇప్పటికే సీరమ్, భారత్ బయోటెక్ సంస్థల నుంచి వ్యాక్సిన్ల ఆర్డర్ ఇచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ కానీ, అడ్వాన్స్ కానీ ఇవ్వలేదు. కేవలం మాకు 4 కోట్లు ఇవ్వండి అంటూ ఒక లేఖ రాసారు. అన్ని రాష్ట్రాలు కోటి, 50 లక్షలు ఇలా ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాయి. ఇదే విషయం ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎందుకు వ్యాక్సిన్ లు తెప్పించటం లేదు అని అడిగారు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు. సీరమ్ ఇన్ స్టిట్యూట్ వారి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఈ దేశమంతా వేసుకుంటుంటే, మనం ఎందుకు ఇంకా డబ్బులు కట్టి, ఆర్డర్ పెట్టలేదు అంటూ ప్రశ్నించారు. అయితే దీనికి వైసీపీ వైపు నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది.
మంత్రులు మీడియా ముందుకు వచ్చి, మీకు డబ్బులు ఇస్తాం, ఎకౌంటు నెంబర్ చెప్పండి వేస్తాం, మీరే వ్యాక్సిన్ లు తీసుకు రండి అంటూ, ఎగతాళిగా వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రతిపక్షాన్ని చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వ్యాక్సిన్ల పై వస్తున్న విమర్శల పై, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వ్యాక్సిన్ ల పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు బంధువు అయిన భారత్ బయోటెక్ లో ఏమి జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా అని అడిగారు. రామోజీ వియ్యంకుడిదే కదా అంటూ జగన్ దెప్పి పొడిచారు. దేశంలో ఎంత మందికి వ్యాక్సిన్ కావలి, ఎంత ఇప్పటి వరకు వేసారు, ఇవేమీ చూసుకోకుండా, విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ, ఇంత చీప్ గా, చంద్రబాబు బంధువు అంటూ, తప్పించుకునే ప్రయత్నం చేయటం ఆశ్చర్యపరుస్తుంది. పక్క రాష్ట్రాలు ఆర్డర్ ఇస్తున్నట్టు, ఇప్పటి వరకు మనం ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు అనే దానికి మాత్రం సమాధానం రాలేదు. మొత్తానికి ఇది కూడా చంద్రబాబు పాపం అంటూ, ఆయన ఖాతాలో వేసి, చేతులు దులుపుకున్నారు.