అమరావతి ప్రాంతం పై మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ప్రాంతాన్ని కార్పొరేషన్ గా మార్చాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సమబందించి, 2019లోనే కార్యాచరణ మొదలై, కార్పొరేషన్ లో కలుపుతారు అనే సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన కార్యాచరణ ప్రభుత్వం మొదలు పెట్టింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్, నోటిఫికేషన్ విడుదల చేసారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 19 గ్రామాలు కార్పొరేషన్లోకి వెళ్ళనున్నాయి. తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలు, అలాగే మంగళగిరి మండలంలో 3 గ్రామాలు కార్పొరేషన్ లో కలవనున్నాయి. అమరావతి కాపిటల్ సిటీ కార్పొరేషన్ గా, ఈ కార్పొరేషన్ ఆవిర్భవించే అవకాసం ఉంది. దీనికి సంబంధించి, గ్రామ సభలు నిర్వహించాలని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తుళ్ళూరు ఎంపీడీవోకి ఈ బాధ్యతలు అప్ప చెప్పుతూ, నోటిఫికేషన్ జారీ చేసారు. మొత్తం ఈ 19 గ్రామాలకు సంబంధించి అనేక చోట్ల కూడా గ్రామ సభలు నిర్వహించి, ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి, నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, ఒక్కసారిగా ప్రజల్లో ఆసక్తి రేగింది. ఒక పక్క మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తెస్తాం అంటూ, ఈ నిర్ణయం తీసుకోవటం పై ఆసక్తి నెలకొంది.

amaravati 03012022 2

ప్రస్తుతం రాజధానిలో అమరావతి కొనసాగాలని చెప్పి, రాజధాని రైతులు గత రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే సమయంలో, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, పోలీసులు సహాయం కూడా తీసుకోవాలని చెప్పి, నోటిఫికేషన్ లో పొందు పోరచటం విశేషం. శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని, గ్రామ సభల కార్యక్రమాన్ని పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నివేదికను అందచేయాలని, కలెక్టర్, తుళ్ళూరు ఎంపీడీవోని ఆదేశించారు. ఆ మేరకు తుళ్ళూరు ఎంపీడీవో కార్యాలయానికి కూడా సంబంధిత నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది వారు త్వరలోనే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి, కార్యాచరణ ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తామని చెప్తున్నారు. గతంలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా, ఈ కారణంగానే నిర్వహించలేదని, ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయం పై కోర్టుకు కూడా చెప్పింది. దీంతో, ఇప్పుడు ఈ నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read