తూర్ప గోదావరి జిల్లాలోనే, పవన్ పై పర్సనల్ అటాక్ చెయ్యటం, కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి, కాపులను రెచ్చగొట్టటం.. ఇవన్నీ జగన్ ఏమన్నా పిచ్చోడు అయ్యి చేస్తున్నాడా ? జగన్ కు మరీ అంత రాజకీయ పరిణితి లేదు అనుకోవాలా ? దీని వెనుక పెద్ద స్టొరీనే ఉంది. ఇది కూడా ఆపరేషన్ గరుడలో భాగమే, కాకపోతే ప్లాన్ మారింది అంతే.. పవన్, జగన్ తో బీజేపీ ప్రధానంగా చెయ్యాలి అనుకుంది, రాష్ట్రంలో కుల గొడవలు రేపి, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటం. దీని కోసమే పవన్ కళ్యాణ్ పదే పదే చంద్రబాబుని, లోకేష్ ని రెచ్చగొట్టాడు. పవన్ పై వ్యతిగత విమర్శలు చెయ్యాలనే ప్లాన్ వేసారు. కాని తెలుగుదేశం పార్టీ, చాలా పరిణితిగా వ్యవహరించింది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి, వాళ్ళ స్చూలే అంత.. ఇక్కడ పవన్ తో కుల గొడవలు రెచ్చగోడదాం అనే ప్లాన్ వొర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే ఆపరేషన్ గరుడ ప్లాన్ - బి ని వెంటనే అమలు పరుస్తుంది బీజేపీ..
కాపు, రెడ్డి ఓటు పోలరైజేషన్.. పవన్ పై పదే పదే పర్సనల్ అటాక్ చెయ్యటం, కాపులకు నేను వ్యతిరేకం అనే భావన జగన్ కలిగిస్తున్నాడు. తద్వారా, కాపులు అంతా కన్సాలిడేట్ అవ్వాలని, వారంతా పవన్ వైపు రావాలనేది వ్యూహం. ఇక రెడ్డి ఓటింగ్ మెజారిటీ జగన్ కు ఎలాగూ ఉంది... పవన్, తెలుగుదేశం మధ్యలో కాపు ఓట్లు ఎలాగూ చీలిపోతాయి, తనకు ఎలాగూ వాళ్ళు వెయ్యరు అని జగన్ కు తెలుసు, అందుకే తెలుగుదేశం వైపు ఉండే కాపులని కూడా కుల పరంగా రెచ్చగొట్టి, అందరినీ పవన్ వైపు తిప్పే ప్లాన్... ఇక ప్లాన్ ప్రకారం రేపో మాపో, జగన్ బీసీల తరుపున మాట్లాడతాడు. మీ కోసం, కాపు రిజర్వేషన్ కూడా వదులుకున్నా అంటాడు. కొన్ని బీసి సంఘాలు వచ్చి, జగన్ కు మద్దతు తెలుపుతాయి. తరువాత, కాపులకి, బీసిలకు మధ్య చిచ్చు పెడతారు. తద్వారా, తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ వోట్ బేస్ అయిన బీసిలను కొంత మేరకు దూరం చేసే ఎత్తుగడ ఇది..
దీంట్లో జగన్ కు లాభం ఉంది. చివరకు బీజేపీ, జగన్ చేతిలో బకరా అయ్యేది మాత్రం పవన్ కళ్యాణ్... కాపుల్లో మూడు పోలరైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ స్ట్రాంగ్ కాంగ్రెస్ ఓట్ బేంక్ (కృష్ణా, గుంటూర్, ప్రకాశం), రెండు ట్రెడిషనల్ స్ట్రాంగ్ తెదేపా బేంక్ (గోదావరి, ఉత్తరాంధ్ర, సీమ, నెల్లూరు), మూడు రాష్ట్రవ్యాప్తంగా మెగా ఫ్యామిలీ ప్రభావితం చేయగలిగిన యువ అభిమానులు. తెదేపాని వ్యతిరేకించే ట్రెడిషనల్ కాంగ్రెస్ కాపులకి రాజ్యాధికారం కంటే తెదేపాని గద్దె దించడమే ముఖ్యం. పవన్ తెదేపాని ఓడించలేడు, ముఖ్యమంత్రి అవలేడు కనుక తన పల్లకీ మోయడంతప్ప వాళ్ళకి వేరు దారి లేదని జగన్ ధీమా. ఎందుకంటే వీళ్ళే 2009 లో చిరంజీవికి దెబ్బేసి వైఎస్ రెడ్డికి గుద్దారు. అందుకే పవన్ ని తిట్టినా, రిజర్వేషన్లు లేవు పోండి అన్నా సరే వాళ్ళు తనకి దాసోహమే అని జగన్ కాలుక్యులేట్ చేసుకున్నాడు. ఈ మొత్తం డ్రామాలో చివరకు పవన్ కళ్యాణ్ ఒక పావుగానే మిగిలిపోతాడు. తెలుగుదేశం గెలిచినా, ఏదన్న అద్భుతం జరిగి జగన్ గెలిచినా, పవన్ కళ్యాణ్ మళ్ళీ తన అన్న లాగే వెళ్ళి సినిమాలు తీసుకోవటమే. పవన్ కు దీంట్లో పోయేది కూడా ఏమి లేదు, దానికి వేరే లెక్కలు ఉన్నాయి. అంతా అమిత్ షా మాయ... అయితే, అమిత్ షా, మోడీ, జగన్, పవన్, చంద్రబాబు కంటే, ప్రజలు చాలా తెలివిగలవారు, అన్నీ గమనిస్తున్నారు... వాళ్ళే సరైన నిర్ణయం తీసుకుంటారు.