నాలుగు రోజులు ఆపసోపాలు పడుతూ, నడుముకు బెల్ట్ వేసుకుంటూ, సాగిన పాదయత్రకు బ్రేక్ పడింది... నాలుగు రోజులు నుంచి జగన్ వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది... ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు పాదయత్రకు బ్రేక్ తీసుకుందామా అని ఆలోచిస్తున్న జగన్ ఎగిరి గంతేస్తూ, నాంపల్లి కోర్ట్ కు వెళ్లారు... అక్కడ తన పాత స్నేహితులు, దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి జానర్ధన్ రెడ్డిని కలిసి పాదయత్ర అనుభవాలు పంచుకుంటున్నారు... ప్రస్తుతం జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్రంగా ఆస్తులు వెనకేసుకున్న కేసులో ప్రతి శుక్రవారం కోర్ట్ కి రావాలి... కోర్టు వాయిదా ఉన్నందున పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు వచ్చారు...
అయితే జగన్ షడ్యుల్ చూసిన పార్టీ వర్గాలు మాత్రం, సాఫ్ట్ వారే ఎంప్లాయిస్ కూడా ఇంతలా ఎంజాయ్ చెయ్యరు అంటున్నారు... ఎవరికైనా శనివారం సెలవు ఉంటుంది... జగన కు మాత్రం శుక్రవారం నుంచే లాంగ్ వీకెండ్ మొదలైంది అంటున్నారు... నిజానికి, జగన్ కు చిత్తసుద్ధి ఉంటే, పాదయత్ర నుంచి కోర్ట్ కి వెళ్లి, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు.. కాని, హాయిగా లోటస్ పాండ్ వెళ్ళాడు, అక్కడ మస్సాజ్ లు చేపించుకుని, డాక్టర్ లకు చూపించుకుని, సకల సౌకర్యాలు అనుభవించి, కోర్ట్ కి వెళ్లారు... మధ్యానం కోర్ట్ అయిపోగానే, మళ్ళీ లోటస్ పాండ్ కి వెళ్తాడు.. హాయిగా అక్కడ స్పెండ్ చేసి, రేపు సాయంత్రానికి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు...
ఇలాంటి పాదయాత్ర ఎక్కడా చూడలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... జగన్, కోర్ట్ కి వెళ్లి వచ్చేస్తే బాగుండేది అని, లోటస్ పాండ్ వెళ్ళటంతో, అతని చిత్తశుద్ది తెలుస్తుంది అని అంటున్నారు... రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, చివరకు షర్మిల పాదయాత్ర చేసినా, ఇలా ఎప్పుడూ చెయ్యలేదు అని అంటున్నారు... ఇలాంటి వెరైటీ పాదయాత్ర ఇప్పటివరకు మన దేశంలో చూడలేదు అని, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని గుర్తు చేస్తున్నారు.. ఒక పక్క బెయిల్ మీద బయట తిరుగుతూ, ప్రతి వారం కోర్ట్ కి వెళ్తూ, రోజుకి ఒక అంతర్జాతీయ నిఘా సంస్థలో అక్రమాలు చేసాడని పేరు తెచ్చుకుంటూ, ఈయన అవినీతి మీద పోరాటం చేస్తాను అనటం, అన్నిటికి అంటే హైలైట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...