ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. నెల్లూరు రూరల్ మండలం దేవరకొండ దగ్గర ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తారు. దీనికి స్పందించిన జగన్.. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, దానికి మద్దతు ఇవ్వలేమని జగన్ స్పష్టం చేశారు. వినతిపత్రం కూడా తీసుకోలేదని నిరసిస్తూ జగన్‌కు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

jagan 0502208 2

మరో వైపు, పాదయాత్రలో భాగంగా ఆర్యవైశ్యులతో జగన్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ అనుచరుడు అమరా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నా, బూతులు తిడుతున్నా, జగన్ నవ్వుతూ ఎంజాయ్ చేశాడే కాని, అతన్ని ఆపలేదు... ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ(నుడా) చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం రాత్రి నెల్లూరు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించారు.

jagan 0502208 3

పాదయత్ర చేస్తూ, ప్రజల కోసం పోరాడాలి, చంద్రబాబు తప్పు చేస్తే ఆ విధానాలను ఎండగట్టాలి, లేకపోతే చంద్రబాబు తప్పు చేసాడు అని ప్రజల్ని కన్విన్సు చెయ్యాలి.. అంతే కాని, నోటికి వచ్చినట్టు తన చెంచాల చేతే బూతులు తిట్టించటం, దాన్ని తన ఛానల్ లో లైవ్ ఇవ్వటం, సోషల్ మీడియా కిరాయి బ్యాచ్ దాన్ని ప్రచారం చెయ్యటం, ఇదేనా రాజకీయం ? సాక్షాత్తు జగనే, కాల్చాలి, ఉరి వెయ్యాలి, చెప్పులతో కొట్టాలి అని అంటే, చదువు సంధ్యా లేని మూర్ఖులు, కుల పిచ్చతో విర్రవీగే వారు, ఇలాగే బరి తెగించి మాట్లడతారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read