వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటే ఎంత హడలో తెలిసిందే... గోదావరి వాళ్ళ వెటకారం కూడా మంత్రి ఆదినారాయణ రెడ్డి ముందు దిగదుడుపే అని చెప్పాలి... మంత్రి ఆది, జగన్ ని ఆ రకంగా ర్యాగింగ్ చేస్తారు... అసెంబ్లీలో జగన్ ను ఏ విధంగా కామెడీతో ఏడిపించారో, అందరూ చూసారు... మంత్రి ఆదినారాయణ రెడ్డి మరోమారు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ చెప్పిన వ్యాఖ్యలతోనే, జగన్ కు కౌంటర్ ఇచ్చారు.
జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్లకు వృద్ధాప్య పించన్ ఇస్తామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో సోమిరెడ్డి, ఆదినారాయణలు సెటైర్లు వేశారు. సాధారణంగా 65 ఏళ్లు దాటితే వృద్ధులు అంటారని, వృద్దాఫ్య ఫించన్ విషయంలో జగన్ ఫార్ములాను ఏమైనా మార్చారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే అందరినీ ముసలివాళ్లను చేస్తున్నాడని విమర్శించారు.
రేపు, అంటే డిసెంబర్ 21న పుట్టిన రోజు చేసుకోబోతున్న జగన్‌కు కూడా 45 ఏళ్లు వస్తాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేస్తోంది.. జగనన్న కాదని, జగన్ తాతయ్య అని ఎద్దేవా చేశారు. ఇక నుంచి జగన్ ను తాతయ్య అని పిలవాలని, వైసీపీ నాయకులు అన్న వస్దున్నాడు అనే బదులు తాతయ్య వస్తున్నాడని నినాదం ఇవ్వాలని సూచించారు. 45 ఏళ్లుకు, రూ.2వేల పెన్షన్ అంటే, ఎంత మందికి రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వాలో, ఎంత ఖర్చు అవుతుందో, అసలు ఇవన్నీ జగన్ కు తెలుసా అని ఎద్దేవా చేశారు... మొత్తానికి, రేపు 45వ ఏటలోకి అడుగుపెడుతున్న జగన్, ఆయన లాజిక్ ప్రకారం, రేపటి నుంచి తాత కాబోతున్నారు...