నేను నిజాయితీపరుడుని... నాకు అవినీతి అంటే ఏంటో తెలీదు... నాకు మోసం చెయ్యటం రాదు.. ఇది మా నాన్న నాకు నేర్పించింది... నన్ను అంత పద్ధతిగా, అవినీతి అంటే ఏంటో తెలీకుండా మా నాన్న నన్ను పెంచాడు.... మా నాన్న పాలించిన కాలం, స్వర్ణ యుగం... అందుకే అలాంటి పాలన మళ్ళీ రావాలి, అందుకే పాదయాత్ర చేస్తున్నా... మా నాన్న స్వర్ణ యుగం మళ్ళీ తీసుకువస్తా... చంద్ర బాబు పాలనా లో ఆనందం కరువైంది... నేను వస్తే, ఆనందమే ఆనందం.... చంద్రబాబు పాలనలో ఐఏఎస్ ల పని తీరు చూసారా... నేను వస్తే, వాళ్ళు ఎలా పని చెయ్యాలో చేప్తా.... ఇది జగన్, తన పాదయత్ర మొదలు అవుతున్న సందర్భంగా చేసిన ప్రసంగం... ఇంకా చాలా ఉంది, చదవండి...
చంద్రబాబుకి రాజధాని ఎలా కట్టాలో తెలీదు... నాకు తెలుసు... చంద్రబాబుకి పెట్టుబడులు ఎలా తేవాలో తెలీదు, కాని నాకు తెలుసు.. చంద్రబాబుకి పరిపాలన ఎలా చెయ్యాలో తెలీదు.. కాని నాకు తెలుసు... చంద్రబాబుకి పోలవరం ఎలా కట్టాలో తెలీదు... కాని నాకు తెలుసు... చంద్రబాబుకి నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలీదు... కాని నాకు తెలుసు... చంద్రబాబుకి ముసలి వాళ్ళకి పెన్షన్ ఎలా ఇవ్వాలో తెలీదు... కాని నాకు తెలుసు... చంద్రబాబుకి వ్యాపారాలు ఎలా చేపించాలో తెలీదు... కాని నాకు తెలుసు.... చంద్రబాబు చేసేవి స్కాంలు... నేను చెయ్యాలి అనుకునేది అభివృద్ధి... చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్... నేను, అభివృద్ధిలో నెంబర్ వన్...
మన రాష్ట్రంలో అసలు వర్షాలు పడ్డాయా ? నేను పాదం పెడితే వర్షాలు పడతాయి... చంద్రబాబు నాలుగేళ్లలో ఏమి చేసాడు ? నేను ఒక్క సంవత్సరంలో చేస్తా... 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా... మా నాన్న ఫోటో పక్కన, నా ఫోటో పెట్టుకోండి... ఇవాల్టి నుంచి పాదయత్ర చేస్తున్నా... శుక్రవారం మాత్రం కోర్ట్ కి పోవాలి, ఆ రోజు అందరికీ సెలవు... నా కోసం ఎదురు చూస్తూ ఉండండి, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీ సమస్యలు తీర్చేస్తా... గెట్టిగా నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని మీరందరూ ప్రార్ధించండి... మా నాన్న ఆశయమే నా ఆశయం.. అదే...అవినీతి లేని సమాజం... అంటూ జగన్ ప్రసంగం ముగించారు... అంతే జగన్ రాక్స్... జనం షాక్స్...