యధా నేత, తధా నాయకులు... జగన్ ఒక పక్క, ప్రతి ఊరిలో తిరుగుతూ, కలెక్టర్ ల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆ నేతలు కూడా అలాగే రెచ్చిపోతున్నారు. జగన్ సిఎం కుర్చీ ఎక్కగానే ,ఒక్కొక్క నా కొడుకుకి నడి బజారులో బట్టలూడదీసి కొడతామంటూ రెవిన్యూ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసాడు రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. దీని పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన గళం విప్పారు. రెవిన్యూ ఉద్యోగులు దశల వారిగా ఆందోళనకు రంగం సిద్ధం చేశారు.
ఉద్యోగుల మనోబావాలు దెబ్బతీసేలే ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండురోజులుగా సోషియల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో రెవిన్యూ ఉద్యోగులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు. రెవిన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి దశల వారి ఆందోళనకు రంగం సిద్ధం చేసుంది. ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై చట్టపరచర్యలు చేపట్టే వరకు జిల్లా వ్యాప్తంగా రోజూవారి నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని...సోమవారం జరుగు గ్రీవెన్స్ డేని బహిష్కరించాలని...బుధవారం నుంచి జరుగు గ్రామ సభలు సైతం బహిష్కరిస్తామని ఏపీ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ శనివారం తీర్మానం చేసింది. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ కి వివరించారు.
ప్రధానంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెవీన్యూ ఉద్యోగులపై నోరు పారేసుకోవడంతో పాటు జిల్లా కలెక్టర్ ని సైతం తూలనాడడం రెవిన్యూ ఉద్యోగుల ఆగ్రహానికి దారి తీస్తోంది. ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఉద్యోగులు మనోభావాలు దెబ్బతినడంతో పాటు,రెవిన్యూ సిబ్బంది భయాందోళనలకు గురిలకావడం వల్ల,స్వేచ్ఛగా ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించలేని వాతావరణం నెలకొందని రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందిలో మనోధైర్యం పెంపొందాలంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై చట్టపర చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ నాయకుడు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడవచ్చు https://www.facebook.com/chankya.p/videos/181805822666724/