వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై తుది నివేదిక సమర్పించకుండా సిట్‌ను ఆదేశించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టును అభ్యర్థించారు. వివేకా మృతి సున్నితమైన అంశమైనందున ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలనీ విన్నవించారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ జగన్, వివేకా భార్య సౌభాగ్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు ఏవీ శేషసాయి, యు.దుర్గాప్రసాద్రావుల ధర్మాసనం మంగళవారం విచారించింది.
ఈ సందర్భంగా జగన్ పిటిషన్‌కు ఆయన తరఫు న్యాయవాది అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ.. సాక్షాత్తు సీఎం, సిట్ ఉన్నతాధికారులు సైతం కేసును ప్రభావితం చేసేలా మాట్లాడిన తర్వాత దర్యాప్తు సక్రమంగా సాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. అందుకే ఈ కేసును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
అయితే, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ చూసి, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడైనా దోషులు ఎవరో చెప్పండి, దోషులని శిక్షించండి అని అంటారు, అదీ సొంత కుటుంబ సభ్యుడు, సొంత బాబాయి అయితే, ఆ ఆవేదన మరింత ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ వైఖరి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. దర్యాప్తు వివరాలు బయటకు పెట్టద్దు, నివేదిక ప్రజలకు చెప్పద్దు అంటూ కోర్ట్ కు ఎందుకు వెళ్ళారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అంటే ఆరోపణలు వస్తునట్టు, వైఎస్ కుటుంబంలోని సభ్యులే ఈ హత్యలో ఉన్నారా, అనే అనుమానాలు బలపడుతున్నాయి. చూద్దాం మరి కోర్ట్ ఏమి చెప్తుందో...