జాతీయ స్థాయిలో ఒక పక్క నరేంద్ర మోడీ దూసుకుపోతుంటే, మరో పక్క రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే రేస్ లోకి వస్తున్నారు... గుజరాత్ ఎలక్షన్స్ లో, మోడీని ధీటుగా ఎదుర్కున్నారు రాహుల్... ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో వైఎస్ జగన్, కేసుల నుంచి తప్పించుకోవటానికి, ఇప్పటికే బీజేపీ ఆడుతున్నట్టు ఆడుతున్నారు అనే విమర్శలు వస్తున్నయి. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాం అనే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు... జగన్ కు, సోము వీర్రాజు లాంటి వారి ఫుల్ సపోర్ట్ ఉంది... ఈ పరిస్థుతుల్లో జగన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు ఫోన్ చెయ్యటంతో, వైసీపీ నాయకులు ఆశ్చర్యపోయారు...
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అద్యక్ష్యుడిగా పట్టాభిషేకం చేసిన రోజు, జగన్, రాహుల్ కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపార అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది... రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది మరో సారి రుజువైంది... మొన్నటి దాకా, రాహుల్ కి జీ హుజూర్ అన్న జగన్, 2014 ఫలితాలు రాగానే, ఆహ్మేదాబాద్ బేజేపే ఆఫీస్ కి వెళ్లి, మోడీకి జై కొట్టారు... అప్పటి నుంచి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ గా పేరు ఉన్నా, ఏ నాడు శత్రువులుగా అయితే లేరు.. జగన్ మోడీకి దగ్గర అవుతున్నట్టు కనిపిస్తున్నా, ఇప్పుడు రాహుల్ కి ఫోన్ చేసి, మళ్ళీ స్నేహానికి జీవం పోశారు...
ఎటు తరిగి ఎటు వస్తుంది అనుకున్నారో ఏమో, ముందు జాగ్రత్తగా రాహుల్ ని మచ్చిక చేసుకున్నారు జగన్... ఇప్పుడిప్పుడే రాహుల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, రాహుల్ తో వైరం లేకుండా, ముందుగానే జగన్ స్నేహ హస్తం అందించారు... రాష్ట్రంలో బీజేపీ నాయకులు జగన్ తో వెళ్తానికి ఉబలాట పడుతున్నా, బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం చంద్రబాబు లాంటి మిత్రుడుని వదులుకోవటానికి సిద్ధంగా లేదు... ఒక వేళ, మైత్రి కొనసాగితే, మోడీ, బాబుల జోడీని ఎదుర్కొనడానికి ఢిల్లీ పెద్దలు అవసరం తనకు ఉందని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికైతే పొత్తులపై ఎటువంటి కామెంట్ చేయని జగన్..రాహుల్ గాంధీ కోసం ఎప్పుడూ వైసిపి ద్వారాలు తెరిచే ఉంటాయనే సిగ్నల్ ఢిల్లీకి పంపారు.