ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వైఎస్ జగన్ ఫోన్ చేసారు. వేమూరి కనకదుర్గ మృతి పట్ల జగన్ సంతాపం తెలిపారు. రాధాకృష్ణను ఫోన్‍లో పరామర్శించారు. వేమూరి రాధాకృష్ణకు కాంగ్రెస్ నేత రాహుల్‍గాంధీ కూడా ఫోన్ చేసి పరామర్శించారు. రాధాకృష్ణకు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దిగ్భ్రాంతి - వేమూరి కనకదుర్గ ఆంధ్రజ్యోతి సంస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు - ఆదర్శ గృహిణిగా ఉంటూ సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు - వేమూరి కనకదుర్గ నేటి మహిళలకు ఆదర్శం - వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం : సీజేఐ ఎన్వీ రమణ. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సంతాపం తెలిపిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు - వేమూరి కనకదుర్గ ఆంద్రజ్యోతి సంస్థల పురోభివృద్ధికి కృషి చేశారు - ఉద్యోగుల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న చర్యలు శ్లాఘనీయం - వేమూరి కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతితో దిగ్భ్రాంతికి గురయ్యా - సంస్థ నిర్వహణ బాధ్యతలతో కనకనదుర్గ తనదైన ముద్ర వేశారు - వేమూరి రాధాకృష్ణ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సంతాపం తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహనరావు, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, వెలగపూడి రామకృష్ణ, ఏలూరి సాంబశివరావు, డోల బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, బీజేపీ నేత లంకా దినకర్, టీడీపీ నేత దేవతోటి నాగరాజు. వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి సంతాపం తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహనరావు, వికలాంగుల సంక్షేమ మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు - ఆంధ్రజ్యోతి ఎదుగుదలలో కనకదుర్గ రాధాకృష్ణకు అనుక్షణం తోడుగా నిలిచారు - డైరెక్టర్‍గా సంస్ధను సమర్ధవంతంగా ముందుకి నడపడానికి అహర్నిశలు కృషిచేశారు - రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : కంభంపాటి రామ్మోహనరావు