అక్రమఆస్తుల కేసులు ఎదుర్కుంటున్న జగన్ మోహన్ రెడ్డి, ఆ కేసులు విచారణకు మాత్రం హాజరు కావటం లేదు. ఎన్నికల్లో గెలవకు ముందు వరకు, ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే వారు. పాదయాత్రలో ఉన్నా సరే , పాదయత్రకు సెలవు పెట్టి మరీ కోర్టుకు వెళ్ళే వారు. కానీ ఇప్పుడు గెలిచిన తరువాత మాత్రం, ప్రతి శుక్రవారం ఏదో ఒక కారణం చెప్పి, ఆయన విచారణకు వెళ్ళటం లేదు. దీని పైన ఇప్పటికే తాను ప్రతి వారం విచారణకు రాలేను, నా బదులు, మా లాయర్ వస్తారని కోర్టుకు చెప్పగా, సిబిఐ కోర్టు ఆ పిటీషన్ ని తిరస్కరించింది. కోర్టు ముందు హోదాలు పని చేయవని, కోర్టు ముందు ఎవరు అయినా ఒక్కటే అని, విచారణకు హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి సిబిఐ ఆదేశాలను అపీల్ చేస్తూ, తెలంగాణా హైకోర్టుకు వెళ్ళారు. ఆయన తెలంగాణా హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ కేసుల విచారణ కోసం, వారానికి అయుదు రోజులు తాను కోర్టుకు హాజరు కాలేనని, తాను అన్ని రోజులు కోర్టుకు వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయి అంటూ, ఆయన కోర్టుకు వేసిన పిటీషన్ లో తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ ను, నిన్న తెలంగాణా హైకోర్టు విచారణ చేపట్టగా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

tg hc 04122021 2

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తరుపున వాదనలు వినిపిస్తూ, కోర్టుకు రావాలి అంటే, పాలనా పరమైన ఇబ్బందులు ఉంటాయని, అలాగే ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి, భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయని కోర్టుకు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే, ఆయన్ను కలవటానికి ఎక్కువ మంది కోర్టుకు వస్తారని, ఇది కూడా ఇబ్బంది అవుతుందని కోర్టుకు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి సియం కాక ముందు ప్రతి వారం కోర్టుకు వచ్చే వారని, ఏమైనా ప్రత్యేక కారణాలు ఉంటే, కోర్టు అనుమతి తీసుకునే వారని, కోర్టుకు తెలిపారు. ఈ కేసులు చాలా ఉన్నాయని, అంశాలు కూడా సంక్లిష్టంగా ఉన్నాయని, కేసులు విచారణకు చాలా సమయం పడుతుందని, ప్రతి సారి విచారణకు హాజరు కావాలి అంటే ఇబ్బందులు వస్తాయని, ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు నిందితులుగ ఉంటే, వారిని ఇబ్బంది పెట్టవద్దు అంటూ గతంలో ఇచ్చిన తీర్పులను కూడా కోర్టుకు ఇచ్చారు. అయితే కోర్టు కలుగ చేసుకుని, పీవీ నరసింహారావు ఎన్ని సార్లు వచ్చారని ప్రశ్నించారు. బీహార్ లాంటి చోట అంటే, సాక్ష్యులు భయపడతారు కానీ, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ కౌంటర్ కోసం, కేసుని ఈ నెల 6కు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read