ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అడ్డ దారులు తొక్కుతూ ప్రజల మీద భారం వేసే ప్రయత్నం చేస్తుందని, పెద్ద ఎత్తున విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే చెత్త పన్నుతో పాటుగా, ఆస్తి పన్ను విలువ ఆధారంగా పెంచి, ప్రజల పైన భారాలు వేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా ఇంటి ప్లాన్ల పేరుతో కొత్త పన్ను బాదుడికి సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేయటం కూడా ప్రారంభించారు. 1994 తరువాత నిర్మించిన ఇళ్ళకు, ఇంటి ప్లాన్ ని పరిశీలించి, ప్లాన్ ప్రకారం మన ఇల్లు లేకపోతే, అంటే ప్లాన్ డీవియేషన్ ఉంటే వాళ్ళ మీద పెనాల్టీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఆదాయం రాబట్టుకోవాలనే ఉద్దేశం తప్ప, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే ఆలోచన లేకుండా బాదేస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ నగర పాలక సంస్థలో, అనేక మందికి ఏదైతే పన్నుకు సంబంధించి, రెగ్యులర్ గా కట్టే టక్స్ కి సంబంధించి , డిమాండ్ నోటీస్ లు వస్తున్నాయో, అందులోనే, ఈ పెనాల్టీ విధిస్తున్నారు. ఆ నోటీసులు చూసిన ప్రజలు షాక్ తింటున్నారు. ఆ నోటీసులు చూసిన ప్రజలు, అవి తీసుకుని వెళ్లి వార్డు సచివాలయాల్లో, కార్పొరేషన్ కార్యాలయాలకు వెళ్లి అడుగుతుంటే, మీ ఇంటి ప్లాన్ తీసుకుని రండి, అప్పుడు దీనికి సంగతి ఏమిటో చూస్తాం అని చెప్తున్నారు.

tax 111122021 2

ఇంటి ప్లాన్ తీసుకుని వెళ్తే, మీరు నిర్మించిన ఇంటికి సంబంధించి, కార్పొరేషన్ ఇచ్చిన ప్లాన్ కి విరుద్ధంగా, మీరు ఇల్లు నిర్మించారని, అందుకే దాని మీద టాక్స్ విధిస్తున్నారని, చెప్పారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ నోటీస్ లో ఇది రావటంతో, అధికారులు చెప్తున్న సమాధానానికి ప్రజలు బెంబేలుఎత్తి పోతున్నారు. విజయవాడ నగర పాలక సంస్థలో 1994 తరువాత నిర్మించిన ఇళ్ళకు, విలువ ఆధారిత పన్ను అని మొన్న కొత్తగా పన్ను విధించిగా, ఇప్పుడు కొత్తగా, ప్లాన్ కి విరుద్ధంగా మీరు ఇల్లు కట్టారు అంటూ, మరో పన్ను విధించటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి ఈ నిర్ణయం పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. వందల కోట్ల డబ్బులు రాబట్టుకునెందుకు మాత్రమే, ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని, ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయం పైన ప్రతిపక్షాలు కూడా భగ్గుమంటున్నాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు, ఇప్పుడు దోచుకోవటం దుర్మార్గం అని విపక్షాలు వాపోతున్నాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read