జగన్ కు సడన్ గా బీసిల మీద ప్రేమ పుట్టుకొచ్చింది... రాష్ట్రంలో బిసి ఓటర్లను ఆకర్షించేందుకు పాదయత్రలో నానా పాట్లు పడుతున్నారు... టు బిసిలకు, అటు చేతి వృత్తి పనుల కూలీల పై వరాల జల్లు కురిపించారు... 45 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చి, అందరిని షాక్ కు గురి చేశారు... 45 ఏళ్లకే పెన్షన్ ఏంటో ఆయనకే తెలియాలి... చంద్రబాబు బీసీ ద్రోహి అని ప్రకటించారు... తాను ముందు నుంచి బీసీలకు పెద్ద పీట వేస్తున్నాను అని, మా పార్టీ బీసీ వర్గాలకు వేదిక అని చెప్పారు.... కాని వాస్తవం వేరే రకంగా ఉంది... ఇప్పుడు జగన్ పాదయత్ర చేస్తున్న రాయలసీమలో, బీసీల గొంతు ఎలా కోసారో, ఈ లెక్కలు చెప్తున్నాయి... 2014లో లెక్కలు ఇవి...
రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజక వర్గాలలో 9 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు తీసివేయగా మిగిలిన 43 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాలలో 'తన' కులం వారికే జగన్ మోహన్ రెడ్డి సీట్లు ధారాదత్తం చేసి మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో కేవలం 12% మాత్రమే ఉన్న 'రెడ్డి' వర్గం వారికి 82% సీట్లు కేటాయించి, 68% ఉన్న మిగిలిన OC మరియు BC కులాల వారికి కేవలం 18% సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో బలమైన 'బలిజ' వర్గానికి కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించి, 'కమ్మ' వర్గానికి, యాదవ, గౌడ, వైశ్య వర్గాల వారికి కనీసం ఒక్క స్థానాన్ని కూడా కేటాయించ లేదు. జగన్ మోహన్ రెడ్డి 'కుల తత్వానికి, కుల దురహంకారానికి ఇంత కన్నానిలువెత్తు సాక్ష్యం ఇంకేమి కావాలి. BC, SC, ST కులాల వారిని కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తూ, డబ్బుతోనో, నయానో, భయానో లొంగదీసుకొవాలని చూస్తున్నాడు.
రాయలసీమ జిల్లాల్లో ఒక్క కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం తప్ప మిగిలిన జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లో మొత్తం 'రెడ్డి' కులం అభ్యర్ధులనే నిలబెట్టి జగన్ మోహన్ రెడ్డి నిస్సిగ్గు గా తన కుల తత్వాన్ని చాటుకున్నాడు... అయితే తాజా సర్వేలు ప్రకారం, జగన్ ఎక్కడైతే బలం ఉంది అనుకుంటున్నాడో, అదే రాయలసీమలో జగన్ గ్రాఫ్ భారీగా పడిపోతుంది అని వార్తలు వస్తున్నాయి... దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నిక... కాపులు, బలిజలు, ముస్లిమ్స్ చంద్రబాబు వైపు వన్ సైడ్ వోటింగ్ వేసేసారు... రాజశేఖర్ రెడ్డి హయాయంలో "మేళ్ళు" తో కోట్ల కు పడగలెత్తిన వాళ్ళు తప్పితే, పెద్దగా ఎవరూ జగన్ వైపు ఇంట్రెస్ట్ చుపించాపోవటంతో, ఇప్పుడు బీసి కార్డు ఎత్తుకున్నారు... ఇప్పటి వరకు గుర్తుకురాని బీసీలు, సడన్ గా గుర్తుకు వచ్చారు...