జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అన్నిరంగాల్లో విఫలమైందని, తాజాగా విద్యుత రంగంలో ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వానికి ముందుచూపులేకపోవడం వల్ల ప్రజలతో పాటు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలుకూడా తీవ్రమైనఇక్కట్లపాలవుతున్నారని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతప్రభుత్వంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేయడం జరిగింది. ముఖ్యమంత్రే స్వయంగా అధిక ధరకు విద్యుత్ కొంటున్నారని ఆరోపణలు చేశారు . మరలా ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వమే తిరిగి పీపీఏలు చేసుకుంది. ఈ విధంగా ఒకదశా-దిశా లేకుండా ప్రభుత్వం ముందుకు పోతోంది. మన రాష్ట్రానికి 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే, 145 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతోంది. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ ముఖ్యమంత్రి బొగ్గుకొరతని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేసి, బహిరంగ మార్కెట్లో అధికధరకు కొంటున్నాడు. ఎందుకు విద్యుత్ ఉత్పత్తి ఆపేశారంటే, బయట రూ.2.50 పైసలకే విద్యుత్ దొరుకుతోంది, అదేమనం ఉత్పత్తి చేస్తే అంతకంటే ఎక్కువ ఖర్చవుతోందని చెబుతున్నాడు. అలా చెప్పిన పెద్దమనిషే నేడు యూనిట్ విద్యుత్ ను రూ.20లకు కొంటున్నాడు. రోజుకి విద్యుత్ కొనుగోలు కోసమే రూ.60 కోట్లు వెచ్చిస్తున్నాడు. విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం దాగి ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేసి, అధిక ధరలకు బయట కొనడమేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. విద్యుత్ కొనుగోలుభారాన్ని ఈ ముఖ్యమంత్రి ప్రజలపైనే వేస్తున్నాడు. ఇప్పటికి 6సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ట్రూఅప్ ఛార్జీలు, ఆఛార్జీలు, ఈఛార్జీలు అంటూ వారిని దోచేస్తున్నారు. 2014-19 నాటికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిపై ట్రూఅప్ ఛార్జీలు వేస్తానంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి దృష్టంతా విద్యుత్ ఛార్జీలుపెంచడం, కరెంటు కోతలు పెట్టడం పైనే ఉంది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రయ్యాక ఎప్పుడూ కరెంట్ కోతలు అనేవిలేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక విద్యుత్ కోతలు పెరిగాయి... ఛార్జీలు పెరిగా యి. ఈ ముఖ్యమంత్రి ఏపీఈఆర్ సీ ద్వారా రూ.26,260కోట్లు రుణం తీసుకున్నారు.
6సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి రూ.11,611కో ట్ల భారం ప్రజలపై వేశాడు. అప్పులు ప్లస్ ప్రజలపై వేసిన ఛార్జీలు కలిపి అంతిమంగా జనంపైనే రూ.36వేల కోట్లు అయ్యింది. తెచ్చిన అప్పులు ముఖ్యమంత్రి ఏంచేశారో తెలియదు? కేంద్రఇంధనశాఖా మంత్రి ప్రహ్లద్ జోషి ఏమంటారంటే, ఏపీ విద్యుత్ సంస్థలకు తామెప్పుడో లేఖ రాశామని, బొగ్గు కొరత ఉంటే తీసుకోవాలని చెప్పామంటున్నారు. సింగరేణి ఇతర బొగ్గుఉత్పత్తి సంస్థలకు ఏపీ ప్రభుత్వం బాకీ ఉందని, సింగరేణి సంస్థకు రూ.2వేలకోట్లు, మహానది కోల్ ఫీల్డ్స్ కు రూ.200కోట్లు, కోల్ ఇండియావారికి రూ.215కోట్లు బాకీ ఉన్నారని కేంద్రమంత్రి చెబుతున్నారు. ఆ బాకీలు చెల్లించి, బొగ్గు దిగుమతి చేసుకోవాలని, చౌకగా థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవాలని కూడా తాము చెప్పామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అంటున్నారు. విద్యుత్ రంగంపై, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఈ ముఖ్యమంత్రి నోరు పెగలడంలేదు. సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తున్నాడు. అనధికారికంగా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలుచేస్తోంది. కోతలని చెప్పకుండా ఏవేవో కారణాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలుసరిగా నడవడంలేదు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రాలు ఆపేసి, బయటనుంచి రూ. 20లకు విద్యుత్ కొనడం, కుంభకోణం కాక ఏమవుతుంది?