"ప్రత్యేక హోదా", కొన్నాళ్ళ క్రిత్రం రాజకీయాలు అన్నీ దీని చుట్టుతా నడిచాయి.... ఒక పక్క పవన్, ఒక పక్క జగన్ హడావిడి చేశారు... ఏమైందో ఏమో కాని, సడన్ గా ఆ "ప్రత్యేక హోదా" విషయం మరుగున పడిపోయింది. ప్రజలు కూడా మర్చిపోయారు... ఇది ప్రజా ఉద్యమం కాదు, ఇది కేవలం రాజకీయ ఉద్యమమే అని అర్ధమైపోతుంది...
ఇక ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ అయితే, యువభేరీ అంటూ జిల్లాల్లో సభలు కూడా పెట్టారు... జూన్ తరువాత MPలు అందరూ రాజీనామా చేసేస్తారు అన్నారు... ఏమైందో ఏమో తెలీదు కాని, ప్రధాని మోడీని కలిసిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు. తరువాత బీజేపితో చర్చులు, స్వామీజీలతో చర్చలు, ఇలా అన్నీ సాగాయి...
బీజేపితో, పొత్తు, విలీనం అనే వార్తలు వచ్చాయి.. తన కేసులు మాఫీ కోసం, బీజేపితో చర్చలు జరిపారు... పాదయాత్రకు లైన్ క్లియర్ చెయ్యమని అడిగారు అనే వార్తలు వచ్చాయి... చివరకు కోర్ట్ లో, శుక్రువారం మినహియింపు కావలి అని కూడా పిటిషన్ వేశారు... మరో పక్క, ఏ వ్యుహ్యం తీసుకున్నా పారటం లేదు... అన్నీ ఫ్లోప్ అవుతున్నాయి... మరో పక్క బీజేపి పొత్తు అని కాని, విలీనం అని కాని క్లారిటీ ఇవ్వటం లేదు... ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి...
దీంతో జగన్, మరో సారి "ప్రత్యేక హోదా" ఎత్తుకున్నారు.. రేపు అనంతపురంలో సభ పెడుతున్నారు... అయితే ఎప్పటిలాగే, హోదా ఇచ్చే అవకాశం ఉన్న, మోడీని ఏమి అనకుండా, చంద్రబాబుని తిట్టటమే ఎజెండా... ఒకవేళ బీజేపితో క్లారిటీ లేకపోతే, "ప్రత్యేక హోదా" ఎజెండాతో ఉన్న పవన్ తో అయినా పొత్తు కోసం అడగవచ్చు అనేది ప్రశాంత్ కిషోర్, జగన్ వ్యుహ్యంగా ఉంది... అందుకే, ఇటు బీజేపి క్లారిటీ ఇవ్వకపోవటంతో, ఈ సభలు ఒక నాలుగు పెట్టి, పవన్ తో పొత్తు ప్రయత్నాలు చేద్దామని జగన్ ఆలోచన...