గత వారం, కరోనా పెద్ద రోగం కాదు, పారాసిటమాల్ వేసుకుంటే చాలు, మాకు ఇప్పుడే ఎన్నికలు పెట్టాలి అని గోల గోల చేసి, ఏకంగా ఎన్నికల కమీషనర్ కే కులం ఆపాదించిన వైఎస్ జగన్, ఎట్టకేలకు వారం తరువాత, కరోనా ఉందని, దేశంలో భయానక పరిస్థితి ఉందని ఒప్పుకున్నారు. అలాగే, ఈనెల 31 వరకు రాష్ట్రంలో లాక్​డౌన్​ను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో లౌక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి కిలో పప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.వెయ్యి అందిస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్లు ఇంటికెళ్లి నగదును అందజేస్తారని పేర్కొన్నారు. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని స్పష్టం చేశారు.

జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వెంటనే 104కు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్​ను ఆమోదిస్తామని...అసెంబ్లీని కూడా కొన్ని రోజులపాటే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమన్న జగన్ అందరితోపాటు బస్సులు, వాహనాలు నిలిపివేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇక మరో పక్క, కరోనా సౌత్ కొరియాలో పుట్టింది అంటూ, జగన్ నోరు జారటంతో, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక మరో పక్క, కరోనా వ్యాపించిన జిల్లాల జాబితాను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు వెల్లడించింది. వీటిలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాల పేర్లను చేర్చింది. పక్కరాష్ట్రమైనా తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్లు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read