కేంద్రాన్ని అడిగి మరీ తాము చేతకానివాళ్లం అని అనిపించుకున్నారు వైసీపీ నేతలు. పోలవరాన్ని 2020 అని ఒకసారి, 2021లో మరోసారి, 2022లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ మంత్రులు కేంద్రం సమాధానంతో ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుందా అని..రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం అవునంటూ సమాధానం ఇవ్వడంతో వైసీపీ ఎంపీలు ఖంగుతిన్నారు. టిడిపి హయాంలో 72 శాతం పనులు పూర్తి అయిన పోలవరం వైసీపీ సర్కారు రాకతో నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్తో ఏడాది, వరదలతో మరో ఏడాది ఆలస్యమైన పనులు కనీసం 3 శాతం కూడా కాలేదు. దీంతో 2024కి కూడా ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యమని కేంద్రం తేల్చి చెప్పేసింది.
Advertisements