ప్రకాశం జిల్లాలో పాదయత్ర చేస్తూ, రాజధానికి అనువైన ప్రాంతం దొనకొండ అని, నేను సియం అయిన వెంటనే, అమరావతిని మార్చేస్తంటూ జగన్ చేసిన ప్రకటన, అమరావతిలో వ్యతిరేకత తెప్పించిన సంగతి తెలిసిందే.. అయితే, అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, వారిని సముదాయించారు... పాదయాత్ర మంగళగరికి వచ్చినప్పుడు, జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని వారికి హామీ ఇచ్చారు... అయితే, గురువారం వరకు జగన్ మంగళగిరిలోనే ఉన్నా, అమరావతి పై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు... ఇదే విషయం నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని రైతులు అడగ్గా, ఈ రోజు శుక్రవారం కోర్ట్ కి వెళ్ళారని, రేపు విజయవాడలో అడుగు పెట్టే లోపు, జగన్ అమరావతి పై ప్రకటన చేస్తారని చెప్పారు...
అయితే, జగన్ మాత్రం, అమరావతి అనే పేరు పలకటానికి కూడా ఇష్ట పడలేదు... తెల్లారి లేగిస్తే, అమరావతిలో అల్లకల్లోలం జరుగుతుంది అంటూ హడావిడి చేసి జగన్ బ్యాచ్, మరి పాదయాత్ర రాజధాని గ్రామాల నుంచి ఎందుకు చెయ్యలేదు ? నిజంగా అంత ఘోరాలు అమరావతిలో జరుగుతుంటే, జగన్ ప్రతిపక్ష నాయకుడుగా అటు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా అంటూ, నిలదీశారు.. జగన్ మాత్రం, ఇవేమీ పట్టించుకోలేదు... అమరావతి పై తనుకున్న ద్వేషాన్ని చూపిస్తూ, అమరావతి అనే మాట కూడా ఎత్తకుండా, విజయవాడ వెళ్ళిపోయారు... దీంతో రాజధాని రైతులు మండిపడుతున్నారు...
రాజధానిపై జగన్ స్పష్టమైన ప్రక టన చేస్తాడని చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యాత్రలో ఆ విషయమే ప్రస్తావించలేదని.. దానికి ఆర్కే రాజీనామా చేస్తారా..? అని రైతు నాయకులు నేలపాడు సర్పంచ్ ధనేకుల సుబ్బారావు ప్రశ్నించారు. రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టు ఉండి, పుష్కలమైన నీరు, రాష్ట్రానికి మధ్యలో ఉన్నప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. జగన్‌లా దోచుకొని ఇక్కడ రైతులు కోటీశ్వరులు అవలేదన్నారు. రాజధాని రావటంతో కష్టపడి సంపాదించిన భూములకు విలువ పెరిగి కోటీశ్వరులు అయ్యారని అన్నారు. 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చి సంతోషంగా ఉంటే రాజకీయాల కోసం అభాండాలు వేయటం సరికాదని, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో పాదయాత్ర చేసేవారని రాజధాని రైతులు అన్నారు...