తాడేపల్లి జగన్ నివాసం దగ్గర, రోజు రోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అది ఒక ధర్నా చౌక్ లాగా మారిపోయింది. అన్ని వర్గాల ప్రజలు, వివిధ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జగన్ మీద ఆశ పెట్టుకుని, ఎదో చేస్తారని ఆశించి, ఏమి చెయ్యకపోవటంతో, జగన్ నివాసం దగ్గరకు వచ్చి, న్యాయం చెయ్యాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఒక రోజు కాదు, ప్రతి రోజు ఇదే తంతు కొనసాగుతుంది. ఈ రోజు మాత్రం మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో జగన్ నివాసం వద్ద పోలీసులను భారీగా మొహరించారు. రేషన్ డీలర్లు, జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం అని చెప్పటంతో, పోలీసులు సెక్షన్ 30 అమలు చేసి, భద్రత కలిపిస్తున్నారు. ఒక పక్క రేషన్ డీలర్ల టెన్షన్ ఉంటూ ఉండగానే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపధ్యంలో, గతంలో ఎప్పుడూ లేనంత టెన్షన్ జగన్ నివాసం వద్ద ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో దాదపుగా 29 వేల మంది రేషన్ డీలర్లు, తమ బ్రతుకు ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ రావటంతో, రేషన్ డీలర్ల పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో రేషన్ డీలర్లును తీసేస్తారు అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే మా గురించి క్లారిటీ ఇవ్వండి అని రేషన్ డీలర్లు ఎన్ని సార్లు అడిగినా, ఎవరూ స్పందించటం లేదు. దీంతో వారు ఆందోళన బాట పట్టారు. వారధి వైపు నుంచి పెద్ద ఎత్తున రేషన్ డీలర్లు వస్తూ ఉండటంతో, పోలీసులు వారిని అక్కడే అడ్డుకుంటున్నారు. అక్కడ నుంచి వారిని వెనక్కు పంపిస్తున్నారు. మరో పక్క డ్వాక్రా మహిళలు, మాకు పసుపు కుంకుమ చెక్కులు రాలేదని , మా మోర ఆలకించాలని వస్తే, వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరో పక్క, కంప్యూటర్ ఆపరేట్ ఉద్యోగులు కూడా జగన్ నివాసం వద్ద ఆందోళన చేసారు. అయితే పోలీసులు ఎవరినీ లోపలకి పంపించటం లేదు.