జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య స్నేహం ఇప్పటిది కాదు. మానుకోండలో రాళ్ళు పెట్టి కొట్టి, జగన్ తెలంగాణాలో పర్యటన చెయ్యకుండా చేసిన కేసీఆర్ కు, జగన్ ఇంతలా దగ్గర కావటానికి కారణం, చంద్రబాబు. అటు కేసిఆర్ కు, ఇటు జగన్ కు, ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి, చంద్రబాబు ఏపి సియంగా ఉంటే, తెలంగాణా చెప్పిన మాట వినరు కాబట్టి, కేసీఆర్, జగన్ తో స్నేహం చెయ్యటం మొదలు పెట్టి, ఉమ్మడిగా, చంద్రబాబుని ఎదుర్కోవటం మొదలు పెట్టరు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం, జగన్ కు, కేసీఆర్ చేసిన మేళ్ళు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి చంద్రబాబుని ఓడించారు. జగన్ ఎక్కగానే, మన సచివాలయ భవనాలు లాక్కున్నారు. మరో పక్క, మన గోదావరి నీళ్ళు, తెలంగాణా భూభాగం నుండి తరలించే ప్రణాళిక రచిస్తున్నారు. ఇలా తెలంగాణాకు అన్ని విధాలుగా లాభం చేకూరే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికి అటు జగన్, ఇటు కేసిఆర్, దాదపుగా నాలుగు సార్లు సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం తారా స్థాయిలో ఉంది. అయితే, ఈ స్నేహం మధ్య ఆర్టీసీ విషయంలో, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒక పక్క తెలంగాణాలో ఆర్టీసి విలీనం చెయ్యం అని కేసీఆర్ అంటుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, జగన్ కమిటీలు వేసారు. అయితే, నిన్న కేసిఆర్ ప్రెస్ మీట్ లో, జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆర్టీసిని ఏ దిక్కుమాలినోదు అయినా ప్రభుత్వంలో విలీనం చేస్తారా అని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ నేతలు, కార్యకర్తలు హార్ట్ అయ్యారు. అంతే కాదు, ప్రెస్ మీట్ లో విలేఖరులు, అక్కడ జగన్ ఆర్టీసిని విలీనం చేస్తున్నారు, ఇక్కడ మీరు చేయటానికి ఏమైంది అని ప్రశ్నించగా, కేసీఆర్ చెప్పిన సమాధానం కూడా గట్టిగా ఉంది.
కేసిఆర్ మాట్లాడుతూ, అక్కడ మన్ను కూడా ముందుకు వెళ్ళలేదు. విలీనం అన్నారు అంతే. దాని పై కమిటీ వేసారు. అది ఎప్పటికి వచ్చెనో, ఆరు నెలలకో, మూడు నెలలకో. అక్కడ కూడా ఏమి జరగదు. నేను చెప్తున్నానుగా. నాకంటే ఆర్టీసి గురించి తెలిసినోడు ఎవరున్నారు. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, జగన్ నిర్ణయాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఏదో మభ్యపెట్టటానికి చేసారు అనేలా వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే, కేసీఆర్ అలా ఈ వ్యాఖ్యలు చేసారో లేదో, వెంటనే జగన్, ఆర్టీసి పై మరో నిర్ణయం తీసుకుని, కేసీఆర్ కి ఇన్-డైరెక్ట్ సమాధానమా అనేలా చేసారు. నిన్న కేసీఆర్, ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఏపిలో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను నియమిస్తూ జీవో జారీ చేశారు. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయ శాఖల అధికారులతో గ్రూప్ ఉంటుంది. అయితే, ఇది నిజంగా అమలు అవుతుందా, లేదా అనేది వేచి చూడాలి.