గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు స్వయానా బావ మరిది అయిన వెంకట సుబ్బయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి రోసయ్య సంస్మరణ సభ ఒకటి ఏర్పాటు చేసారు. ఆ సభలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఉన్న సమయంలోనే, వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనను తెలిపారు. మర్రి రాజశేఖర్ వైసీపీ ప్రభుత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేసారు. అతనికి చివరి నిమిషంలో సీటు ఇవ్వకుండా పక్కన పెట్టి, విడదల రజినీకి సీటు ఇచ్చారు. అయితే ఆ సమయంలో జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాగానే మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి, తొలి మంత్రి వర్గంలోనే మంత్రిని చేసి తన పక్కనే కూర్చో పెట్టుకుంటా అని, చిలకలూరిపేట నడి ఒడ్డులో హామీ ఇచ్చారు. అయితే రెండున్నరేళ్ళు అవుతున్నా, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, అసలు ఏమి లేదు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు మర్రి రాజశేఖర్. అయితే ఆయన బావ మరిది వెంకట సుబ్బయ్య ఎప్పుడూ బహిరంగంగా బయటకు వచ్చే వ్యాఖ్యలు చేసింది లేదు. ఈ రోజు మొదటి సారిగా ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పైనే నిప్పులు చెరిగారు.
తమ గుండెల్లో ఉన్న ఆవేదన అంటూ, నిన్న రోశయ్య సంస్మరణ సభలో అన్నారు. తాము గతంలో కాంగ్రెస్ కు సేవ చేసాం అని, ఇప్పుడు వైసిపికి సేవ చేస్తున్నాం అని, మిగతా నేతలు అంత కాక పోయినా, తాము ఖర్చు పెట్టాం అని, గుండెల్లో పెట్టుకుంటాం అని, ఇప్పుడు గుండెల మీద తన్నారని అన్నారు. సొంత కులాన్ని కూడా కాదు అనుకుని వైసీపీకి సేవ చేసాం అని, కాని ఇప్పుడు గుండెల మీద తన్నారని, డైరెక్ట్ గా అన్నారు. ఇక రోశయ్య గురించి మాట్లడుతూ, ఒక సామాజిక వర్గం వారు, రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దింపే దాకా ఆగ లేదని అన్నారు. స్వయం కృషితో ఎదిగి, రాణించిన రోశయ్య లాంటి నేత, మంచి మనిషి చనిపితే, కనీసం వెళ్లి నివాళులు అర్పించే తీరిక కూడా లేక పోయిందని, ఆవేదన యక్తం చేసారు. అయితే ఈ వ్యాఖ్యల పై పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పాతికే రోశయ్యకు జరిగిన అవమానం పై, ఆ సామాజిక వర్గ నేతలు అసహనంతో ఉండగా, ఇప్పుడు ఇలా బయట పడి, ఏకంగా జగన్ నే టార్గెట్ చేయటంతో వైసీపీ ఉలిక్కి పడింది.