ప్రజల సమస్యలు పరిష్కరిస్తాను అంటూ, పాదయత్ర చేస్తూ, తన గుండాల చేత ప్రజలనే కొట్టిస్తున్న రాజకీయం ఇది... వాళ్ళు అలా కొడుతుంటే, పక్క నుంచి వెళ్ళిపోయాడు కాని, కనీసం, కొట్టద్దు అని కూడా అనలేదు అంటే, ఈయన ఎలాంటి రాజకీయ నాయకుడో ప్రజలే ఆలోచించాలి... ఆ గుండాలు తోయ్యటం కూడా కాదు, పడేసి పడేసి అక్కడ సామాన్య ప్రజలను ఇరగ్గోట్టేసారు... పాపం, వాళ్ళు సామాన్య ప్రజలు కదా, ఎదురు తిరిగి కొట్టే బలం వాళ్లకు లేదు.. అందునా వీళ్ళు ఫ్యాక్షన్ గుండాలు, వీరిని ఎదుర్కోవటం చేత కాక, వారి ఊళ్ళో , వారి ఇంటి ముందే, ఈ గుండాల చేత తన్నులు తిన్నారు... నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీ జీవితాలు బాగు చేస్తాన్ను అన్న మనిషి, కనీసం వాళ్ళు అలా కొడుతుంటే ఆప లేదు...
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో అయిదవ రోజు జగన్ పాదయత్ర కొనసాగుతుంది... జగన్ ప్రైవేటు బాధత్రా సిబ్బంది, అక్కడ స్థానిక ప్రజలను కొట్టారు.. జగన్ దగ్గరకి రాబోయిన కార్యకర్తలను ఇరగొట్టారు అక్కడ ప్రైవేటు సిబ్బంది... ఇష్టం వచ్చినట్టు తోసేసారు... దీంతో ఆ ప్రైవేటు సెక్యూరిటీ ఓవర్ ఆక్షన్ తట్టుకోలేక, ప్రజలు కార్యకర్తలు ఎదురు తిరిగారు... జగన్ పాదయాత్ర నిలిపివేసి బాధత్రా సిబ్బందికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు కార్యకర్తలు... వీళ్ళు కొట్టుకుంటూ ఉండగా, జగన్ అక్కడే చూస్తూ నుంచున్నారు...
అయితే మరో వాదన కూడా తెర పైకి వచ్చింది... గురువారం, వీరికి బిర్యానీ, 400 రూపాయలు ఇస్తాను అని స్థానిక నాయకులు, వీరు పొలంలో పనులు చేసుకుంటుంటే తీసుకువచ్చారాట... అయితే, కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు అంట... సాయంత్రం డబ్బులు ఇస్తాము అని డబ్బులు కూడా ఇవ్వలేదు అంట... నిన్న శుక్రవారం కావటంతో, జగన్ పాదయాత్ర కు సెలవు కాబట్టి, ఎవరూ దొరకలేదు... ఇవాళ వీరు ఈ సమస్య జగన్ కు చెప్పుకుందాం అని వస్తే, ఇలా చేసారని అక్కడ ప్రజలు వాపోతున్నారు... అటు పొలానికి పొతే కూలి అన్నా వచ్చేది అని, ఇక్కడకు వచ్చి తన్నులు తిన్నాం అని బాధ పడుతున్నారు...