జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, గొప్పగా చెప్పుకునే మాట, మేము సంక్షేమం ఇరగదీసి చేస్తున్నాం, అందుకే అప్పులు చేస్తున్నాం, ఇంట్లో కూర్చుని బటన్ నొక్కి నేరుగా ప్రజలకు ఇచ్చేస్తున్నాం, ఇదే సంక్షేమం అంటే అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి గత ప్రభుత్వంలో ఉన్న అనేక పధకాలు రద్దు చేసి పడేసారు. అవి బటన్ నొక్కే పధకాలు కాదు, నిజమైన సంక్షేమం, అన్నం లేనోడికి అన్నం పెట్టటం, చదువుకు సాయం అవ్వటం, స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించటం, భీమా పధకాలు పెట్టి భరోసా ఇవ్వటం, బాలికలకు సైకిల్స్ ఇచ్చి స్కూల్ కు వచ్చేలా చేయటం, ఇలా అనేక పధకాలు, నిజమైనా సంక్షేమానికి నిర్వచనం ఇచ్చే పధకాలు గతంలో ఉండేవి. అవన్నీ ఇప్పుడు రద్దు చేసి, కేవలం నవ రత్నాలు అంటూ అక్కడే ఆగిపోయారు. అయితే ఆ ఇచ్చే పధకాలు అయినా, సవ్యంగా ఇస్తున్నారా అంటే, సవా లక్షా నిబంధనలు, టైంకి ఇవ్వరు, సాకులు చెప్తారు. అమ్మఒడి ఇప్పుడు ఒక ఏడాది ఎగ్గొట్టారు. కానీ ఇచ్చేసాం అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు కట్టిన 11 లక్షలు ఇళ్లు, ఇప్పటికీ పాడుబెట్టి ఇవ్వకుండా, 30 లక్షల ఇళ్ళలో ఒక్కటి కూడా కట్టకుండా, 30 లక్షల ఇళ్లు ఇచ్చేసాం అనే చెప్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం బూటకపు మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారు.
ఇక గత చంద్రబాబు హయాంలో, ఏడాదికి రూ.65 వేల కోట్ల సంక్షేమం జరిగితే, జగన్ మోహన్ రెడ్డి ఏడాదికి రూ.63 వేల కోట్లు మాత్రమే సంక్షేమం చేసారు. లెక్కల్లో కూడా ఇన్ని తేడాలు ఉన్నాయి. ఇక అన్నిటికీ మించి, ప్రజలకు ఈ మధ్య కాలంలో అర్ధమైంది, బాదుడే బాదుడు. జగన్ మోహన్ రెడ్డి ఆ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో లాగిస్తున్నారు అనేది ప్రజలకు బాగా అర్ధమైంది. కరెంటు బిల్లులు, పెట్రోల్ ధరలు, ఆర్టీసి చార్జీలు, ఇంటి పన్ను, చివరకు చెత్త పన్ను కూడా వేసి, ప్రజలను ఎలా పీల్చి పిప్పి చేస్తున్నారో, ప్రజలకు కూడా అర్ధమై పోయింది. తాజాగా నిన్నే ఇలాంటివి రెండు ఘటనలు జరిగాయి. కర్నూలు జిల్లా గూడూరులో, బూటకపు సంక్షేమం పై, అక్కడ ప్రజలు వైసిపీ ఎమ్మెల్యేను నిలదీసిన వీడియో నిన్న వైరల్ అయ్యింది. అలాగే మరో మహిళ, అన్ని చార్జీలు పెంచి, నువ్వు ఇచ్చే పధకాలు మాకు ఎందుకు అంటూ చెప్పిన మరో వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలను నిన్న చంద్రబాబు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇవన్నీ చూస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న బూటకపు సంక్షేమం పై ప్రజలకు అవగాహన ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు అర్ధమవుతుంది.