జగన మోహన్ రెడ్డికి పాదయాత్రలో సన్మానం చేసారు మహిళలు... అదేదో సినిమాలో వెరైటీ సన్మానం చేసినట్టు ఉంది, ఇది చూస్తుంటే... ఇంతకీ సన్మానం ఎందుకో తెలుసా ? మూడు రోజుల్లో, మూడు మాటలు మార్చినందుకు సన్మానం.. ప్రజలను ఎలా పిచ్చోల్లని చేస్తున్నారో చెప్పే సంఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు కలిశారు. వీరిలో వైసీపీ నాయకురాళ్లు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి.పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సన్మానించారు. కాపులకు జగన్ ఇచ్చిన హామీలకు ధన్యవాదాలు తెలిపారు. దీని కంటే కామెడీ సన్మానం ఎక్కడా ఉండదేమో.
పోయిన శనివారం, కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చేశారు జగన్. అది కేంద్రంలో అంశం అని, నేనేమి చెయ్యలేను అని చెప్పారు. గత నెల 27న ఈ ప్రకటన చేశాక రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో కలకలం రేగింది. జగన్ వైఖరేంటో తేటతెల్లమైపోవడంతో... వైసీపీలోని కాపు నేతలు సైతం నివ్వెరపోయారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అయితే జగన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్లను సీఎం చంద్రబాబే అమలుచేస్తారని ధీమా కనబర్చారు. కాపు రిజర్వేషన్ల అంశంలో సెల్ఫ్‌గోల్ చేసుకుంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ప్లస్ అయ్యాయి. కాంగ్రెస్ నేతలు సైతం జగన్‌పై ధ్వజమెత్తారు. బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు సాధించే సత్తా తమకే ఉందన్నారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్ చాందీ. ఇదే విషయాన్ని జిల్లా కాపుల దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు జనసేన కార్యకర్తలు కూడా జగన్‌పై విరుచుకుపడ్డారు.
ప్రజాసంకల్పయాత్రలో అడుగడుగునా జగన్‌కు నిరసనసెగలు తగులుతూనే ఉన్నాయి. కాపుల్ని మోసం చేయవద్దు, కాపు రిజర్వేషన్లపై నీ వైఖరి మార్చుకో అంటూ మహిళలు, పిల్లలు సైతం ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి తోడు... వైసీపీలో కాపు నేతలు కూడా జగన్‌కు మొరపెట్టుకున్నారు. నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే, తాము మునిగిపోతామంటూ జగన్ దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా అయితే కాపు సామాజిక వర్గం ఓటర్ల దగ్గరకు వెళ్లే ఓట్లడిగే సాహసం చేయలేమని తేల్చిచెప్పేశారు. వీటన్నిటికీ తోడు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్నా... బీసీల నుంచి స్పందన రాలేదు. రోజుల గడిచేకొద్దీ కాపులకు దూరం కావడం, బీసీలకు దరిచేరలేకపోవడంతో... 31 వ తేదీన పిఠాపురం పాదయాత్రలో మళ్లీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. తాను యూ టర్న్ తీసుకోలేదన్నారు. జగ్గంపేటలో తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు. బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లకు వైసీపీ మద్దతిస్తోందన్నారు.