రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన 50 రోజులకే, అప్రజాస్వామిక చర్యలతో చెలరేగిపోతుంది. ఎందుకు అసహనమో తెలియదు కాని, 151 మంది బలం ఉన్నా కూడా, జగన్ ప్రతి నిత్యం అసహనంతో ఉంటున్నారు. అసెంబ్లీలో కేవలం 23 మంది ఉన్న టిడిపి సభ్యులను ఎదుర్కోలేక, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఇప్పటికి అనేకసార్లు లెగిసి, నేను మాట్లాడిన తరువాత, ఇంకా ఏమి ఉంటుంది, చంద్రబాబుకి అవకాసం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ, తాను చెప్పాల్సింది చెప్పేసి, చర్చను ముగిస్తున్నారు. సభా నాయకుడే కోరటంతో, స్పీకర్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు బయటకు వచ్చి తాము చెప్పాలి అనుకున్నది చెప్తూ, జగన్ అబద్ధాలను ఎండ గడుతున్నారు. సరిగ్గా ఇక్కడే మూడు టీవీ చానల్స్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది.
రెండు రోజుల క్రితం 45 ఏళ్ళకే, 2 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగినందుకు, ముగ్గురు తెలుగుదేశం సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసారు. ఈ సమయంలో వారిని తీసుకొచ్చి బయట పడేసారు. దీంతో వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి, తమ వాదన వినిపించారు. ఈ సందర్భంలో ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానల్స్ వారు మాట్లాడింది టీవీల్లో లైవ్ ఇచ్చారు. అయితే శాసనసభ జరుగుతుంటే, బయట మీడియా పాయింట్ వద్ద మాట్లాడేవి లైవ్ ఇవ్వకూడదు అనే నిబంధన ఉంది. నిజానికి ఈ నిబంధన పెట్టింది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి. అప్పట్లో తెలుగుదేశం సభ్యులకు అవకాసం ఇవ్వకపోతే, వారు బయటకు వచ్చి మాట్లాడే వారు. అది ప్రజల్లోకి వెళ్ళేది. అందుకే, అలా కాదు అని ఈ రూల్ తెచ్చారు. కాని, అంత కఠినంగా అమలు చెయ్యలేదని చెప్పాలి.
తరువాత వచ్చిన చంద్రబాబు కూడా, ఈ నిభందనను పెద్దగా పట్టించుకోలేదు. ప్రతిసారి అసెంబ్లీ జరుగుతున్న టైంలో, అసెంబ్లీ కంటే, సాక్షి టీవీలో, బయట వారి సభ్యులు మీడియాతో మాట్లాడేది చూపించేవారు. అయితే చంద్రబాబు మాత్రం, అవి పెద్దగా పట్టించుకోలేదు. అందరి వాదన ప్రజల్లోకి వెళ్తే మంచిదే కదా అని అనే వారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, ఒక 5 నిమిషాలు వారు మీడియాతో మాట్లాడింది చూపించినందుకు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానెల్స్ ని అసెంబ్లీ లోపలకి అనుమతించ లేదు. దీంతో వారు షాక్ అయ్యారు. ఈ నిబంధన ఉన్నా, మేము అంత పెద్ద నేరం ఏమి చేసామని అడుగుతున్నారు. అసెంబ్లీ అనేది జగన్ ఇష్టం కాదని, ప్రతి వార్తా ఛానెల్ కు అక్కడ జరుగుతుంది చూపించే హక్కు ఉంది అని అంటున్నారు. చిన్న నిబంధన సాకుతో, ఏకంగా మూడు ప్రధాన టీవీ చానల్స్ ను జగన్ అసెంబ్లీలోకి వెళ్ళకుండా బ్యాన్ చెయ్యటం పై, ఆయన నిజ స్వరూపం ఏంటో బయటపడుతుందని, ప్రతిపక్షాలు అంటున్నాయి.